గుండెపోటు తెచ్చేంత పారితోషికం పెంచేసిన యాంకర్!!

Tue Aug 11 2020 12:15:09 GMT+0530 (IST)

Glamorous Anchor's New Demands Worries Producers!

వైరస్ ఎందరికో ఎన్నో రకాలుగా పాఠం నేర్పిస్తోంది.  తిరిగి కోలుకోలేనంత దారుణ నష్టాలకు కారణమైంది. ముఖ్యంగా టాలీవుడ్ లో కొందరికి గుండెపోటు కూడా తెప్పిస్తోంది. ఇటీవల ఓ ఇద్దరు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాతలకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరికీ స్టెంట్లు వేసి డాక్టర్లు చేయల్సిన ప్రయత్నం చేశారు. ఒకే ఒక్క మహమ్మారీ లాక్ డౌన్ ఇన్ని పర్యవసానాలకు కారణమవుతుంటే ..అదేమీ పట్టనట్టు ఆ బోల్డ్ బుల్లితెర యాంకర్ మాత్రం పారితోషికంలో హైక్ డిమాండ్ చేసిందట.ఇండస్ట్రీలోనే బెస్ట్ టీఆర్పీ ఉన్న షోకి యాంకర్ గా కొనసాగుతున్న ఈ అమ్మడికి ఇప్పటికే కళ్లు చెదిరే పారితోషికాన్ని సదరు నిర్మాతలు ప్రోగ్రామ్ నిర్వాహకులు చెల్లిస్తున్నారు. కానీ అది చాలడం లేదంటూ సదరు యాంకర్ డిమాండ్ పెంచేసిందనేది తాజా సమాచారం. అసలే కోవిడ్ భయాలతో షూటింగులో పాల్గొనాల్సి వస్తోంది. ఎక్స్ ట్రా కేర్ కోసం బోలెడంత ఖర్చవుతోందని ఏవేవో లెక్కలు కూడా చెబుతోందట.

అన్నట్టు ఆవిడగారికి నేము ఫేము తెచ్చిందే ఈ బుల్లితెర రియాలిటీ షో. ఖరీదైన లగ్జరీ కార్లలో షికార్లు.. కాస్ట్ లీ విల్లాలు కొనుక్కోగలిగిందంటే.. ఈరోజు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది అంటే అందుకు కారణం ఆ షోనే. కానీ ఆ కనికరం కూడా ఆవిడకు లేదట. ఇటీవల సినిమాల్లోనూ ఛాన్సులు అందుకుంటోంది కాబట్టి అందుకు తగ్గట్టే అనూహ్యంగా రేంజు పెంచేసి బుల్లితెరకు అంత పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేస్తుండడంతో ఆ నిర్మాతకు చెమటలు పట్టేస్తున్నాయని సమాచారం. ఒకవేళ అడిగినంతా చెల్లించుకోలేకపోతే షోకి రాలేనని నిర్మొహమాటంగా  చెప్పేస్తోందన్న గుసగుసా వినిపిస్తోంది. సదరు యాంకర్ కఠిన వైఖరిని కొందరు నిరసిస్తున్నారు. ఆవిడకు ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం అని భావిస్తున్నారట.