అమ్మాయిలు పీరియడ్స్.. మెగా డాటర్ గొప్ప ముందడుగు

Fri Sep 30 2022 10:50:33 GMT+0530 (India Standard Time)

Girls periods.. Mega daughter is a great step forward

ఆడవారికి పీరియడ్స్ అనేది ఒక సాధారణ విషయం.. కానీ మన ఇండియాలో మాత్రం చాలా మంది అదొక అసాదారణ విషయంగా.. ఏదో రహస్యంగా.. దోషంగా.. నేరంగా రకరకాలుగా పుకార్లతో చర్చించుకోవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఉన్న మూడ నమ్మకాల కారణంగా చాలా చోట్ల పీరియడ్స్ వచ్చిన అమ్మాయిల పట్ల ఆ మూడు రోజులు లేదా అయిదు రోజులు చిన్న చూపు చూస్తున్నారు.ఆ విషయమై జనాలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇంకా కూడా కొందరు మూడ నమ్మకాలతో కొట్టుకు ఉంటున్న సమయంలో ప్రముఖులు పీరియడ్స్ అనేది ఒక సామాన్య విషయం.. ఆ విషయంలో ఆడ వారిని కించపర్చే విధంగా లేదంగా అవమానించే విధంగా మాట్లాడటం సరికాదు అంటూ పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఆ అవగాహన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత పాల్గొన్నారు. ఇలా స్టార్స్ ముందుకు వచ్చి పీరియడ్స్ గురించి మాట్లాడటం తో ఉన్న అపోహలు తొలగి పోయి.. రాబోయే తరాల వారు అయినా అమ్మాయిల పీరియడ్స్ అంటే ఒక సాధారణ విషయంగా చూస్తారని విశ్లేషకులు అంటున్నారు. మెగా డాటర్ గారి మంచి తనంతో గొప్ప ముందడుగు వేశారని అభినందనలు తెలియజేస్తున్నారు.

పీరియడ్స్ మహిళ శరీర అభివృద్దికి ఉపయోగపడుతాయి.. పీరియడ్స్  గురించి మాట్లాడేందుకు ఇంకా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఉన్నందుకు బాధ పడుతున్నాను.

ఈ విషయంలో సిగ్గు పడాల్సింది ఏమీ లేదు.. భయపడాల్సింది అంతకంటే లేదు అన్నట్లుగా సుస్మిత వ్యాఖ్యలు చేశారు.

ఈ మెగా డాటర్ నిర్మాతగా మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో పాతుకు పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి యొక్క కాస్ట్యూమ్స్ డిజైనర్ గా కొన్ని సినిమాలకు వర్క్ చేసిన సుస్మిత నిర్మాతగా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. వెబ్ సిరీస్ ని నిర్మించిన సుష్మిత త్వరలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.