పవన్ సినిమా మ్యూజిక్ విషయంలో సుజిత్ ఆప్షన్ ఎవరంటే..?

Tue Dec 06 2022 13:31:57 GMT+0530 (India Standard Time)

Ghibran Is The Music Director For Pawankalyan New Movie

పవర్ స్టార్ తో సినిమా ఎనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు సుజిత్. రన్ రాజా రన్ తో డైరెక్టర్ గా మారి హిట్ అందుకున్న సుజిత్ తన సెకండ్ మూవీనే సాహో తీశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సుజిత్ తో సినిమా తీయడం అంటే అతని మీద ప్రభాస్ కి ఉన్న నమ్మకం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.సాహో అంచనాలను అందుకోకపోవడంతో సుజిత్ కు మరో ఛాన్స్ రాలేదు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే చేసుకున్నాడు సుజిత్. గ్యాంగ్ స్టార్ కథతో వస్తున్న ఈ మూవీకి మ్యూజిక్ డైరక్టర్ ఎవరన్నది రివీల్ చేయలేదు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సుజిత్ కి కోలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ ని రిఫర్ చేస్తున్నారు. పవన్ అజ్ఞాతవాసి సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఆ మూవీ ఫ్లాప్ అయినా సినిమాలో మ్యూజిక్ బాగుంటుంది. అదీగాక ప్రస్తుతం తమిళ సినిమాలకు తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవల్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు అనిరుధ్. విక్రం సినిమాకు అతను ఇచ్చిన మ్యూజిక్ మైండ్ బ్లాక్ చేసింది. అందుకే పవన్ సినిమాకు అనిరుధ్ ని తీసుకోవాలని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

సినిమా ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో మ్యూజిక్ డైరక్టర్ పేరు మెన్షన్ చేయలేదు. కానీ ఆల్రెడీ సుజిత్ ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ ని ఫిక్స్ చేశాడట. అతనెవరో కాదు జిబ్రాన్ అని తెలుస్తుంది.

సుజిత్ చేసిన రన్ రాజా రన్ కి జిబ్రాన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మూవీ మ్యూజికల్ గా హిట్. ఇక సాహో మూవీ కి కూడా జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అలా చెప్పకపోయినా సరే సుజిత్ పవన్ సినిమాకు అతనే మ్యూజిక్ డైరెక్టర్ అని అంటున్నారు. అంతేకాదు ఈ మూవీ పోస్టర్ ని జిబ్రాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సో అలా కూడా ఈ మూవీకి జిబ్రాన్ ఫిక్స్ అయినట్లు చెప్పుకోవచ్చు.

అనిరుద్ ఆప్షన్ అనిపించినా సుజిత్ జిబ్రాన్ కి ఓటు వేయడం కూడా కరెక్టే అని అనుకోవచ్చు. అయితే జిబ్రాన్ చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్స్ లేకపోయినా అతని మ్యూజిక్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. ఆ రకంగా చూస్తే సుజిత్ సెలక్షన్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటూ పవన్ తో ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్న సుజిత్ ఈ మూవీతో తన సత్తా కూడా చాటాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన సుజిత్ ఆయనకు ఎలాంటి సినిమా అందిస్తాడో చూడాలి.