Begin typing your search above and press return to search.

'గని' vs 'లైగర్' - దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది..?

By:  Tupaki Desk   |   24 Jan 2021 2:30 AM GMT
గని vs లైగర్ - దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది..?
X
ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోలు విజయ్ దేవరకొండ - వరుణ్ తేజ్ ఇద్దరూ అనుకోకుండా ఒకే నేపథ్యం ఉన్న సినిమాలతో పోటీ పడుతున్నారు. విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలోనే 'లైగర్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో మెగా హీరో వరుణ్ తేజ్ కొర్రపాటి కిరణ్‌ కుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ బాక్సింగ్ నేపథ్యంలో 'గని' అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఒకే కామన్ పాయింట్ తో వస్తుండటంతో పాటు.. వెంటవెంటనే అప్‌డేట్స్‌ రావడంతో ఒకదానితో ఒకటి కంపేర్ చేసి మాట్లాడుకుంటున్నారు. అలానే 'గని' వ‌ర్సెస్ 'లైగ‌ర్' రెండింటిలో దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది.. ఏ సినిమా మీద ఎక్కువ అంచ‌నాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు.

వాస్త‌వానికి వ‌రుణ్ తేజ్ కి స‌క్సెస్ రేటు ఎక్కువగా ఉండ‌టంతో పాటు గీతాఆర్ట్స్ బ్యాకింగ్ మరియు మెగా ఫ్యాన్స్ స‌పోర్ట్ తో ఈ పోటీలో 'గ‌ని' గ‌ట్టి పోటీనే ఇవ్వనున్నాడు. అదే సమయంలో 'లైగ‌ర్' టీమ్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్ల‌డానికి బాలీవుడ్ స‌పోర్ట్ తీసుకుంది. బాలీవుడ్ దిగ్గ‌జాలు 'లైగ‌ర్'లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ పై బజ్ ఉన్నప్పటికీ విజ‌య్ ని పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 'డియ‌ర్ కామ్రేడ్' అంటూ పాన్ సౌత్ ని టార్గెట్ చేసిన విజ‌య్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కాకపోతే ఈ సినిమా డబ్బింగ్ ని నార్త్ ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు. అంతేకాకుండా పూరీ క‌థ‌లంటే బాలీవుడ్ కి విప‌రీత‌మైన మోజు. ఆ పంధాలో చూసుకుంటే 'లైగ‌ర్' కి పూరీ ఓ పెద్ద ఎస్సెట్ అని చెప్ప‌వ‌చ్చు. మొత్తం మీద లోక‌ల్ ఫైట్ లో 'గ‌ని' 'లైగ‌ర్' మధ్య విప‌రీత‌మైన పోటీ ఏర్ప‌డే అవ‌కాశం ఉందని అనుకుంటున్నారు. అందులోనూ కావాల‌నే 'గ‌ని'కి పోటీగా 'లైగ‌ర్' ఫ‌స్ట్ లుక్ వదిలారని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ఫ‌స్ట్ లుక్ లలో మాత్రం ఇద్ద‌రు హీరోలు స‌మానంగానే మార్కులు కొట్టేశారు. మరి సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.