Begin typing your search above and press return to search.

'సైరా' ట్రైలర్ గెట్ రెడీ !

By:  Tupaki Desk   |   18 Sep 2019 4:31 AM GMT
సైరా ట్రైలర్ గెట్ రెడీ !
X
ఎట్టకేలకు ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు 'సైరా' టీం. నిన్నటి వరకూ ఈరోజు ట్రైలర్ ఉంటుందా లేదా అనే మెగా ఫ్యాన్స్ కి అనుమానాలకి నిన్న సాయంత్రం టీం క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. కేవలం సోషల్ మీడియాలో ట్రైలర్ లాంచ్ కాకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు మేకర్స్. రెండు రాష్రాల్లో దాదాపు తొంబైకు పైగా థియేటర్స్ లో ట్రైలర్ ను ప్లే చేయబోతున్నారు. ఈ మేరకూ సాయత్రం ట్రైలర్ వేసే థియేటర్స్ ల లిస్టు కూడా వదిలారు. అంటే ఈ రోజు నుండి సైరా ప్రమోషన్స్ మొదలుపెట్టినట్టే.

సాయంత్రం హైదరబాద్ ఐమ్యాక్స్ లో ఈ ట్రైలర్ ను ఓ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ కి దర్శకుడు సురేందర్ రెడ్డి అలాగే నిర్మాత రామ్ చరణ్ అటెండ్ అవుతున్నారు. ట్రైలర్ అనంతరం చరణ్, సురెందరే రెడ్డి మీడియాతో ముచ్చటించే అవకాశం ఉంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ కూడా చెప్చనున్నారని తెలుస్తుంది.

ఇక ఇప్పటికే మెగా ఫ్యాన్స్ సైరా ట్రైలర్ డే అంటూ సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేసారు. ఇక సాయంత్రం థియేటర్స్ లో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇప్పటికే టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన సైరా ఇక ట్రైలర్ తో ఏ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సో నేటి నుండి సైరా ప్రమోషన్స్ తో మెగా స్టార్ మేనియా మొదలవుతున్దన్నమాట.