బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పటికే తన కుటుంబం నుండి పలువురిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇటీవలే తన బావ అయిన ఆయుష్ శర్మ తో కలిసి అంతిం అనే సినిమాను చేశాడు. ఆ సినిమా తో ఆయుష్ కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాడు. ఇప్పుడు మేనకోడలు అలిజే అగ్నిహోత్రి ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్దం అయ్యాడు. తన మేన కోడలి ఎంట్రీ కోసం స్వయంగా తానే కథను సిద్దం చేయిస్తున్నాడట. కొత్త వారితో కలిపి ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసేలా చర్చలు జరుపుతున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ మేనకోడలు మరియు బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ తనయుడు ఒకే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయట.
అలిజే
అగ్నిహోత్రి యూకే లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఉన్నత చదువులు చదివినా
కూడా సినిమా పై ఆమెకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అదే విషయాన్ని సల్లూ భాయ్
కి చెప్పి ఆయన్ను ఒప్పించింది. నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు మోడల్ గా
తనను తాను ఇండస్ట్రీకి అనుగుణంగా మల్చుకుని ముందుగానే పాపులర్ అయ్యేలా
ప్రయత్నాలు చేసింది. సోషల్ మీడియా మరియు ఇతర మీడియాల ద్వారా ఇప్పటికే
అలిజే అగ్నిహోత్రి అందరికి సుపరిచితం అయ్యింది. అందుకే హీరోయిన్ గా మొదటి
సినిమా చేసిన సమయంలో కొత్త అమ్మాయి అనే ఫీల్ లేకుండా ఉంటుందని కొందరు
అంటున్నారు.
మొత్తానికి సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఎంతో మందికి కెరీర్
ను ఇచ్చాడు. ఎంతో మంది ని స్టార్స్ గా నిలబెట్టాడు. ఆయన తల్చుకుంటే వరుసగా
సినిమాలను నిర్మించి కొత్త వారిని స్టార్స్ గా నిలబెట్టగల సత్తా ఉన్న
నటుడు. కనుక కోడలు అలిజే అగ్నిహోత్రి ని స్టార్ హీరోయిన్స్ జాబితాలో
చేర్చడం సల్మాన్ కు పెద్ద కష్టం ఏమీ కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అలిజే అగ్నిహోత్రి కష్టపడి సినిమాల్లో నటించి అందంతో ఆకట్టుకుంటే ముందు
ముందు స్టార్ హీరోల సరసన నటించగల స్టార్ హీరోయిన్ అవుతుందనే నమ్మకం
వ్యక్తం అవుతోంది. మొత్తానికి అలిజే అగ్నిహోత్రి హీరోయిన్ గా ఎంట్రీ
ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.