గౌనులో జెనిలియా గుభాళింపు!

Sun May 29 2022 09:00:02 GMT+0530 (IST)

Genelia in the gown!

జెనిలియా అలియాస్  హాసిని సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరుస్తుంటుంది. చూపరుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. అమ్మడు ఎంపిక చేసుకునే డిజైన్లు ఎలివేషన్లో ఎంతో కీలకమని  చెప్పకనే చెబుతుంటుంది. తాజాగా పువ్వుల డిజైన్ గౌనులో జెనిలియా గుభాళింపులు మరోసారి చర్చకు దారి తీసింది.బ్లాక్ అండ్ వైట్  బ్రాండెడ్ డిజైన్ లో మెస్మరైజ్ చేస్తుంది. మోడ్రన్  చెవిదిద్దులు జెన్నీ అందాన్ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి. హెయిర్ మొత్తం దగ్గరకు  సిగముడి వేసింది. ముఖానికి అద్దిన మేకప్ ఐబ్రోస్...ఐస్ అమ్మడి లో బ్యూటీని మరింత హైలైట్ చేస్తున్నాయి.

చేతిలో క్యూట్ గా కనిపించే హ్యాండ్ బ్యాగ్... నెయిల్ పాలిస్... వేలికి పచ్చని పొడితో కూడిన రింగ్ జెనిలియాని మరింత అందంగా మలిచాయి. వివిధ భంగిమల్లో కెమెరాకి ఇచ్చిన ఫోజులు  నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఆల్ర్టా మోడ్రన్ లుక్ లో నెటిజనుల్ని ఆకట్టుకుంటుంది.  

ఇక జెనిలియా కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్ లో ఓ మెరుపు మెరిసిన బ్యూటీ అటుపై బాలీవుడ్ లో స్థిరపడిన సంగతి తెలిసిందే. 'సై'..'బొమ్మరిల్లు' లాంటి సినిమాలు తెలుగులో ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అటుపై పలు చిత్రాల్లో నటించి హిందీ పరిశ్రమకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే రితీష్ దేశ్ ముఖతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కెరీర్ అక్కడే సాగిస్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో 'మిస్టర్ మమ్మి' అనే సినిమాలో నటిస్తుంది. అలాగే తెలుగు ..కన్నడలో ఓ సినిమా చేస్తుంది. దాదాపు దశాబ్ధం తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతుంది. చివరిగా తెలుగులో 'నా ఇష్టం' సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల వైపు చూసింది లేదు.

అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపించలేదు.  మరి మళ్లీ  కంబ్యాక్ అవుతోన్న నేపథ్యంలో   ఎలాంటి పాత్రలతో మెప్పిస్తుందో చూడాలి. అమ్మడు ఇంకా హీరోయిన్ మెటీరియల్..వయసు 36.  మరి  పెళ్లైన బ్యూటీని టాలీవుడ్ ఎంత వరకూ ఆదరిస్తుందో చూడాలి.