Begin typing your search above and press return to search.

'నా 'బిగ్ బ్రెస్ట్ వల్ల ఇన్ సెక్యూరిటీగా ఫీల్ అయ్యేదాన్ని'

By:  Tupaki Desk   |   11 Aug 2022 11:30 PM GMT
నా బిగ్ బ్రెస్ట్ వల్ల ఇన్ సెక్యూరిటీగా ఫీల్ అయ్యేదాన్ని
X
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి గీతూ రాయల్ గురించి తెలిసే ఉంటుంది. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. యూట్యూబర్. చిత్తూరులో పుట్టి పెరిగిన గీతూ.. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయింది. తన చాలకీ మాటలతో.. మోటివేషన్ వీడియోలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే కెమెరా ముందు గలగలా మాట్లాడే ఈ బ్యూటీ.. లేటెస్టుగా తను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్లు చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది.

గీతూ రాయల్ ఓ వీడియో ద్వారా చిన్నప్పటి నుంచి తను బాడీ షేమింగ్ కు ఎదుర్కొన్నానని తెలిపింది. దీని గురించి మాట్లాడటానికి చాలా సిగ్గుగా ఉన్నప్పటికీ.. కొందరినైనా మోటివేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నానని పేర్కొంది. చిన్నప్పటి నుంచీ తన లుక్ మరియు ఫిజిక్ పట్ల చాలా ఇన్ సెక్యూర్ గా ఉండే దానినని.. చుట్టూ ఉన్నవారు తనని ఆ విధంగా చూసేవారని చెప్పింది.

అందరూ తనని అలా చూడటం వల్ల చాలా చాలా ఇబ్బందిగా ఉండేదని గీతూ తెలిపింది. టీనేజ్ నుంచి తనకు బస్ట్ పెద్దదిగా ఉండేదని.. దాని వల్ల చాలా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యేదానినని చెప్పింది. తనకు బెస్ట్ క్యాన్సర్ వస్తే బాగుండని దేవుణ్ణి కోరుకునే దానినని.. ఎందుకంటే అలా అయినా దాన్ని తొలగిస్తారని అనుకునేదాన్నని వివరించింది.

జనాలు నన్ను నార్మల్ గా చూసేవారు కాదు.. నన్ను డిఫరెంట్ గా చూస్తున్నారని సరైన డ్రెస్సులు కూడా వేసుకునే దాన్ని కాదని.. ఎవరూ కలవకుండా ఉండేదాన్నని.. ఫంక్షన్స్ కు కూడా వెళ్ళేదాన్ని కాదని ఆవేదన వ్యక్తం చేసింది. వాటిని కవర్ చేసుకుంటూ ఫుల్ డ్రెస్సెస్ వేసుకునేదాన్ని అని.. రీల్స్ కూడా జూమ్ చేసి చేసేదాన్ని అని వెల్లడించింది. 'జబర్దస్త్' కి వెళ్లిన తర్వాత కూడా షో చూసే జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించేదాన్నని చెప్పింది.

ఎక్కువగా కనిపిస్తోంది.. కనిపించకుండా చున్నీతో కవర్ చేసుకోమని.. కోట్ వేసుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల కూడా ఆత్మనూన్యతా భావంతో ఉండేదాన్ని బోరున ఏడ్చేడింది. కొందరు వాళ్ళకు లేవు అని ఫీల్ అవుతుంటారు.. మరికొందరు ఎక్కువగా ఉన్నారని బాధ పడుతుంటారు. ఇంకొందరు మాత్రం అలాంటివేమీ లేకుండా హ్యాపీగా జీవించేవారు. కానీ నేను మాత్రం చాలా ఇన్ సెక్యూర్ గా ఉండేదాన్ని అని ఎమోషనల్ అయింది.

తన స్నేహితులు తనని బాగా మోటివేట్ చేశారని.. ఫస్ట్ నీ బాడీని నువ్వు ఇష్టపడాలని.. నీకు నచ్చిన బట్టలు వేసుకోమని చెప్పారని గీతూ చెప్పింది. దయచేసి ఎవరూ బాడీ షేమింగ్ చేయొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పొట్ట ఉందని.. లావుగా ఉన్నామని బాధ పడుతూ ఉంటారు.. ఇక్కడ ప్రతీ ఒక్కరూ అందంగానే ఉంటారు. లుక్స్ - సైజులను బట్టి వారిని జడ్జ్ చేయకూడదు.

ఎవడి లైఫ్ కు వాడే కింగ్. ఎవరూ బాడీ షేమింగ్ చెయ్యొద్దు. కుదిరితే మోటివేట్ చేయండి లేదా మూసుకొని ఉండండి. లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా.. నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా.. బస్ట్ ఎక్కువ ఉందా.. బ్యాక్ ఎక్కువ ఉందా అని ఆలోచించకుండా.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.

ఇకపోతే టిక్ టాక్ తో పాపులారిటీ సంపాదించుకున్న గీతూ.. ఆ యాప్ ని బ్యాన్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ - యూట్యూబ్ వీడియోలతో సందడి చేయడం మొదలు పెట్టింది. అలానే 'గలాటా గీతూ రాయల్' పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలుగు 'బిగ్ బాస్' రియాలిటీ షో రివ్యూలు ఇవ్వడం ప్రారంభించింది. ఈ క్రమంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

రేడియో సిటీ హైదరాబాద్‌ లో రేడియో జాకీగా కొన్నాళ్ళు పనిచేసిన గీతూ.. 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. అప్పటి నుంచి రకరకాల షోలు చేయడంతో పాటు.. ఎప్పటిగాలే మోటివేషన్ వీడియోలతో హడావిడి చేస్తోంది. ఇప్పుడు తనకు ఎదురైన బాడీ షేమింగ్ అనుభవాన్ని చెప్పుకొని ఆవేదన చెందింది.