ఆగిపోయిన స్టార్ హీరో సినిమాకి మోక్షం

Fri Mar 17 2023 12:03:01 GMT+0530 (India Standard Time)

Gautham Menon Vikram Movie Started Again

తమిళ స్టార్ హీరో విక్రమ్.. గౌతమ్ వాసు దేవ్ మీనన్ కాంబినేషన్ లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ధృవ నట్చత్తిరమ్  సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన విషయం తెల్సిందే. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత సినిమాను పక్కకు పెట్టడం జరిగింది. ఆ సినిమాను పకక్కు పెట్టి  విక్రమ్ మరియు దర్శకుడు గౌతమ్ మీనన్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యాడు.



గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి చేశాడట. విక్రమ్ తో పాటు ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులందరిని ఒప్పించి షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఒక నటుడు క్లారిటీ ఇచ్చాడు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ను వేసవి కానుకగా మే 19వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఎదురైన అడ్డంకులన్నింటిని తొలగించుకుని షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

తమిళ సినీ ఇండస్ట్రీలో కాకుండా అన్ని భాషల్లో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు గౌతమ్ వాసు దేవ్ మీనన్. ఈయన దర్శకత్వంలో సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. కనుక ధృవ నట్చత్తిరమ్ సినిమా తప్పకుండా తెలుగు లో మంచి మార్కెట్ తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.