Begin typing your search above and press return to search.

`ఘ‌ర్ష‌ణ` సీక్వెల్ తీస్తే స్టార్ హీరోయిన్ రెడీ

By:  Tupaki Desk   |   2 Jun 2020 4:30 AM GMT
`ఘ‌ర్ష‌ణ` సీక్వెల్ తీస్తే స్టార్ హీరోయిన్ రెడీ
X
విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన `ఘ‌ర్ష‌ణ‌` క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌క‌పోయినా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన సంగ‌తి తెలిసిందే. గౌత‌మ్ మేకింగ్ స్టైల్.. వెంకీ స్టైలిష్ పెర్ఫామెన్స్.. అశిన్ క్యూట్ లుక్స్.. హ్యారిస్ జైరాజ్ సూప‌ర్భ్ ట్యూన్స్.. పోలీసాఫీస‌ర్ తో పోటీప‌డే రౌడీ విల‌నీ.. ఇవ‌న్నీ ఈ సినిమాలో హైలైట్స్. ముఖ్యంగా హ్యారిస్ సంగీతం- రీరికార్డింగ్ సెన్సేష‌న్ అనే చెప్పాలి. 2003లో రిలీజైన కాఖా కాఖా అనే త‌మిళ చిత్రానికి ఇది రీమేక్. త‌మిళ వెర్ష‌న్ లో సూర్య‌- జ్యోతిక జంట‌గా న‌టించారు.

అయితే ఆ త‌ర్వాత ఘ‌ర్ష‌ణ (కాఖా కాఖా)కి గౌత‌మ్ మీన‌న్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైనా కానీ ఎందుక‌నో అది ప‌ట్టాలెక్క‌లేదు. ఇన్నాళ్ల త‌ర్వాత ఈ మూవీకి సీక్వెల్ తీస్తే తాను న‌టించేందుకు సిద్ధంగానే ఉన్నాన‌ని జ్యోతిక అన‌డం ఆసక్తిని క‌లిగించింది. దర్శకుడు గౌతమ్ మీనన్ తనకు స్క్రిప్ట్ పంపితే తన బ్లాక్ బస్టర్ చిత్రం కాఖా కాఖాకు సీక్వెల్ చేయడానికి సిద్ధ‌మేన‌ని అంది ఈ వెట‌ర‌న్ న‌టి. `పోన్మగల్ వంధల్` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇన్ ‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సెషన్ లో ఈ సంగ‌తిని వెల్లడించింది. 2003 సూపర్ హిట్ చిత్రం కాఖా కాఖాకు సీక్వెల్ చేయాలని తాను సూర్యా నిర్ణయించుకున్నామ‌ని జ్యోతిక‌ పేర్కొంది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

కాఖా కాఖా ఓ పోలీసాఫీస‌ర్ ఆత్మ‌క‌థ‌. విలన్ ను ఢీకొట్టే పోలీస్ క‌థ‌ను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు గౌత‌మ్ మీన‌న్. ఎలుకా- పిల్లి ఆట‌లా ప్ర‌తి ఫ్రేమ్ ని ఆద్యంతం ఎంతో ఉత్కంఠ‌గా మ‌లిచారు. ఈ త‌ర‌హా క్రైమ్ డ్రామా స్క్రిప్ట్ తనకు ఎంతో ఇష్ట‌మ‌ని జ్యోతిక తాజా సెష‌న్ లో అభిమానుల‌కు తెలిపింది.ఇక జ్యోతిక న‌టించిన తాజా లాయ‌ర్ డ్రామా `పోన్మగల్ వంధల్` డిజిటల్ స్ట్రీమింగ్ లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై స‌మీక్ష‌కులు పూర్తిగా విమ‌ర్శ‌లు గుప్పించారు. `పోన్మగల్ వంధల్` థియేట్రిక‌ల్ రిలీజ్ కి ప‌నికిరాద‌ని.. కేవ‌లం వెబ్ సిరీస్ కంటెంట్ మాత్ర‌మేన‌ని పెద‌వి విరిచేసారు.