Begin typing your search above and press return to search.

RRR ఆస్కార్ కి ఎంపిక కాక‌పోవ‌డంపై గౌత‌మ్ మీన‌న్ వ్యూ ఇదీ

By:  Tupaki Desk   |   29 Sep 2022 4:09 AM GMT
RRR ఆస్కార్ కి ఎంపిక కాక‌పోవ‌డంపై గౌత‌మ్ మీన‌న్ వ్యూ ఇదీ
X
భారతదేశం నుండి 'ఛల్లో షో' అధికారిక ఆస్కార్ ఎంట్రీ అని భారతీయ జ్యూరీ ప్రకటన చేసినప్పుడు చాలా మంది నేరుగా సోషల్ మీడియాలో తమ నిరాశను వ్య‌క్త‌ప‌రిచారు. RRR ని ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై భారీగా తెలుగు సినిమా అభిమానులు.. నెటిజనులు జ్యూరీని నిందించారు. రాజమౌళి దర్శకత్వం వ‌హించిన ఈ భారీ చిత్రం భారతదేశం నుండి బెస్ట్ మూవీ అని అంద‌రూ అభిప్రాయపడ్డారు.

దీనిపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు సినీప‌రిశ్ర‌మ వ్య‌క్తుల నుంచి వ్య‌క్త‌మ‌య్యాయి. ఇప్పుడు ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓపెన్ అయ్యాడు. ఒక బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ-'' మేక‌ర్స్ నిజంగా సినిమా చేసేటప్పుడు అవార్డుల గురించి ఆలోచించరని ..వారి ఏకైక ఏకాగ్రత తమ సినిమాని బెస్ట్ గా తీయ‌డ‌మెలానో చూస్తార‌ని'' అన్నారు. సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందగానే అవార్డుల గురించి చర్చ మొదలవుతుందని కూడా దర్శకుడు గౌత‌మ్ మీన‌న్ త‌న అభిప్రాయాన్ని తెలిపారు.

ఫలానా అవార్డు కావాల‌ని తాను ఎప్పుడూ సినిమాలు చేయనని గౌతమ్ మీనన్ మరోసారి స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ఆర్‌.ఆర్‌.ఆర్ ను తిరస్కరించినప్పటికీ ఆస్కార్ కు నామినేట్ కావడానికి వెలుపల అవకాశం ఉంది.

కానీ ఇక‌పై ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. రాజ‌మౌళి అండ్ టీమ్ ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ కి చేరేందుకు ఏం చేస్తున్నారు? అన్న‌దానికి ఎలాంటి క్లూ లేదు. కానీ ఆస్కార్ బ‌రిలో నెగ్గాలంటే చాలా పెద్ద మొత్తాల‌ను ఖ‌ర్చు చేసి ప్ర‌చారం చేయాల్సి ఉంటుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన నిజం.

విల‌న్ గా మారాడు కానీ ఏం లాభం?

ద‌ర్శ‌కుడిగా ప‌నిని త‌గ్గించుకున్న గౌత‌మ్ మీన‌న్ ఇటీవ‌ల క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా విల‌న్ గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. జాతీయ అవార్డ్ మూవీ ట్రాన్స్ (మల‌యాళం)లో అత్యుత్త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్. ఆ చిత్రంలో క‌థానాయ‌కుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ ని ఇబ్బంది పెట్టే విల‌న్ గా అత‌డు చ‌క్క‌ని న‌ట‌న‌తో మెప్పించాడు. గౌత‌మ్ మీన‌న్ ఇటీవ‌ల న‌టుడిగా రాణిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్న ద‌ళ‌ప‌తి 67 లో విలన్ గా నటించేందుకు గౌతమ్ మీనన్‌ని ఎంపిక చేసారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాల్లో నటిస్తూ నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా నేప‌థ్యంలో ద‌ళ‌ప‌తి 67 ఉంటుంది. కేజీఎఫ్ ని మించి విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా ఈ సినిమాని తెర‌కెక్కించాల‌ని బిగ్ స్కెచ్ వేసార‌ని టాక్ వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.