Begin typing your search above and press return to search.

అఫిషియల్‌ : రామ్ చరణ్‌ 'జెర్సీ' నిజం

By:  Tupaki Desk   |   15 Oct 2021 4:24 AM GMT
అఫిషియల్‌ : రామ్ చరణ్‌ జెర్సీ నిజం
X
నానితో జెర్సీ సినిమాను తెరకెక్కించి జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ప్రస్తుతం హిందీ జెర్సీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత గౌతమ్‌ తిన్ననూరి తెలుగు లో రామ్‌ చరణ్‌ హీరోగా ఒక భారీ సినిమాను చేయబోతున్నట్లుగా చాలా నెలలుగా వార్తలు వస్తున్నాయి. కాని రామ్‌ చరణ్‌ ఇటీవల శంకర్ సినిమాకు ఓకే చెప్పడంతో పాటు ఇతర కారణాల వల్ల వీరిద్దరి కాంబో సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా రామ్ చరణ్‌ తదుపరి సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అఫిషియల్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చింది.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రామ్‌ చరణ్‌ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు సర్‌ ప్రైజ్ అయ్యారు. గౌతమ్‌ తిన్ననూరి ఒక వైవిధ్యభరిత కథను రామ్‌ చరణ్‌ కు చెప్పి ఒప్పించాడు. ఆ కథ నానితో రూపొందించిన జెర్సీ సినిమా తరహాలోనే చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ మెగా కాంపౌండ్‌ లో టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్‌ మరియు గౌతమ్‌ ల కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెళ్లడవ్వాల్సి ఉంది.

రామ్ చరణ్‌ నటించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే జనవరి లో ఆర్ ఆర్ ఆర్‌ ను విడుదల చేయాలని అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఇక శంకర్ తో సినిమాను ఈ నెలలోనే చరణ్ పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు. శంకర్‌ మరియు చరణ్ ల కాంబో మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు శంకర్ మూవీని ముగించాలని భావిస్తున్నాడు. శంకర్ మూవీ ముగిసిన వెంటనే గౌతమ్‌ తిన్ననూరి మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. గౌతమ్ తిన్ననూరి ఈ లోపు హిందీ జర్నీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి స్క్రిప్ట్‌ వర్క్ ను ముగించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.