ఫిలింనగర్ లో నమ్రత మహేష్ ఇంటికెళ్లి చూస్తే..!

Thu Apr 22 2021 10:20:37 GMT+0530 (IST)

Gautam And Sitara Latest Photo Goes Viral

హైదరాబాద్ ఫిలింనగర్ లో నమ్రత- మహేష్ జంట సొంతిల్లు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఇది ఈ సెలబ్రిటీ జంటకు డ్రీమ్ హౌస్. దీనికోసం నమ్రత రెండేళ్ల పాటు ఇంటీరియర్ డిజైన్స్ పై రీసెర్చ్ చేసి ఎంతో వైభవంగా దగ్గరుండి నిర్మించుకున్నారు. ఇక ఈ ఇల్లు బయటి వైపు నుంచి ఎంత సింపుల్ గా కనిపిస్తుందో ఇన్ సైడ్ అందుకు పూర్తి భిన్నంగా విజువల్ రిచ్ గా గ్రాండియర్ గా కనిపిస్తుంది. పదేళ్ల క్రితం పాలాటియల్ పేరుతో ఈ ఇంటిని 14కోట్ల బడ్జెట్ తో నిర్మించుకున్నారు. ఆ పక్కనే ఇంకో ఇల్లు మహేష్ కి ఉందని చెబుతారు. ఈ రెండిటి విలువ కలిపి 28కోట్లు.ఇక లాక్ డౌన్ సీజన్ లో మహేష్ షూటింగులకు వెళ్లకుండా ఈ ఇంట్లోనే స్పెండ్ చేశారు. కుటుంబంతో సమయాన్ని ఆస్వాధించారు. ఈ ఇంటి నుంచి సరిగ్గా 7-8 కిలోమీటర్ల దూరంలో ఉండే సూపర్ స్టార్ కృష్ణ ఫామ్ హౌస్ కం హోమ్ కి వెళుతూ ఉండేవారు. అది హైదరాబాద్ నానక్ రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో ఉంది. ఇక హైదరాబాద్ ఫిలింనగర్ లోనే వందేమాతరం శ్రీనివాస్ ఇల్లు కం స్టూడియో సమీపంలో మహేష్ సోదరి శ్రీమతి మంజుల కు ఒక సొంత ఇల్లు ఉంది.

ఇకపోతే ఇప్పుడు సెకండ్ వేవ్ తో షూటింగులకు బ్రేక్ ఇచ్చిన మహేష్ మళ్లీ ఫిలింనగర్ ఇంట్లోనే ఉంటున్నారు. ఇక వారి పిల్లలు ఇదిగో ఇలా ఇంట్లో ఉంటూ హాయిగా ఆటలు ఆడుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేసిన నమ్రత చాలా సంతోషంగా ఉన్నామని వెల్లడించారు. ``బ్యాక్ టు బేసిక్స్.. నాకు ఈరోజు చాలా సంతోషకరమైన రోజు.. గ్రేట్ ఫుల్ అండ్ బ్లెస్స్ డ్..`` అంటూ నమ్రత సంతోషం వ్యక్తం చేశారు. #వన్ ఫర్ ఈచ్ డే అన్న హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. ఇంట్లో పెట్ డాగ్స్ తో అన్నాచెల్లెళ్లు గౌతమ్ సితార ఆటలు ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది.