Begin typing your search above and press return to search.

కూతురిని చూసి త‌బ్బిబ్బ‌యిన మ‌మ్మీ గౌరీఖాన్

By:  Tupaki Desk   |   15 May 2022 11:30 AM GMT
కూతురిని చూసి త‌బ్బిబ్బ‌యిన మ‌మ్మీ గౌరీఖాన్
X
కుమార్తె తెరంగేట్రం చేస్తోందంటే క‌థానాయిక‌గా పెద్ద తెర వెలుగులు పండిస్తోందంటే ఏ త‌ల్లికి అయినా గ‌ర్వంగా ఉంటుంది. అంత‌కుమించి ఉత్కంఠ గా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఉత్కంఠ‌తోనే ఉంది గౌరీఖాన్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ - గౌరీ ఖాన్ ల గారాల ప‌ట్టీ సుహానా ఖాన్ వెండితెర ఆరంగేట్రం హాట్ టాపిక్ గా మారింది. ఎట్ట‌కేల‌కు సుహానా ఖాన్ స‌హా తార‌ల‌ ఫ‌స్ట్ లుక్ ని ద‌ర్శ‌కురాలు జోయా అక్త‌ర్ విడుద‌ల చేసారు. `ఆర్చీస్` ఫస్ట్ లుక్ & టీజర్ విడుదల తర్వాత సుహానా ఖాన్ - అగస్త్య నందా- ఖుషీ కపూర్ లను గౌరీ ఖాన్ ప్ర‌శంసించారు. ముగ్గురు న‌ట‌వార‌సులు ది ఆర్చీస్ తో తొలిసారిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నందున‌ గౌరీ ఖాన్ ప్ర‌త్యేకంగా అభినందించారు. అలాగే మొత్తం జోయా టీమ్ ని ప్ర‌శంసించారు.

గ‌ల్లీ బోయ్స్ ఫేం జోయా.. మ్యూజిక్ నేప‌థ్యంలో మ‌రో క్లాసీ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. జోయా అక్తర్ త‌దుప‌రి చిత్రం ఆర్చీస్ పోస్టర్ - టీజర్ ను ఆవిష్కరించడంతో సుహానా ఖాన్- అగస్త్య నందా - ఖుషీ కపూర్ ల తొలి OTT చిత్రం లుక్ పై సామాజిక మాధ్య‌మాల్లో గొప్ప డిబేట్ కొన‌సాగుతోంది. ముగ్గురు న‌ట‌వార‌సుల రూపాల‌పైనా డిస్క‌ష‌న్ ఊపందుకుంది. సెల‌బ్రిటీల్లో ప‌లువురు ప‌లు కోణాల్లో యువ‌తార‌ల‌ను ప్ర‌శంసిస్తున్నారు. జోయా అక్తర్ బాలీవుడ్ అడాప్షన్ ది ఆర్చీస్ కామిక్స్ కి ఇండియ‌న్ వెర్ష‌న్ ని రూపొందిస్తున్నార‌ని తెలియ‌గానే ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. టీజర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే అది ఇంటర్నెట్ లో సునామీగా మారింది. సుహానా ఖాన్ తల్లి గౌరీ ఖాన్ ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. అరంగేట్ర తార‌లంద‌రికీ శుభాకాంక్షలు తెలిపింది.

గౌరీ ట్వీట్ లో ఇలా రాసింది,- “అభినందనలు... అద్భుతమైన పిల్లలు #TheArchies బృందానికి ఆల్ ది బెస్ట్. ఈ ప్రయాణంలో వారికి మార్గనిర్దేశం చేయడానికి #జోయా అఖ్తర్ కంటే ఎవరు బెస్ట్‌?!! నువ్వే బెస్ట్ గా చేశావు సుహానా!!!!!!!!..! అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు.

ఆర్చీస్ లో వెరోనికాగా సుహానా ఖాన్, .. బెట్టీగా ఖుషీ కపూర్ .. ఆర్చీస్ గా అగస్త్య నందా న‌టిస్తున్నారు. మొదటి పోస్టర్‌ను షేర్ చేస్తూ మేకర్స్ ఇలా వ్యాఖ్యానించారు. మీ పిక్నిక్ బాస్కెట్ లను పట్టుకోండి.. మీ అందమైన దుస్తులను ఎంచుకోండి.. మేము ఆర్చీ గ్యాంగ్ ను అభినందించబోతున్నాము. తారాగణాన్ని ప్రదర్శిస్తాము. ది ఆర్చీస్.. జోయా అక్తర్ చిత్రం`` అని వెల్ల‌డించారు. టీజర్ ను పంచుకుంటూ ఈ చిత్రంలోని ఇతర పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్ ఇలా వ్యాఖ్యానించారు. ``సూర్యుడు బయటపడ్డాడు.. వార్త ముగిసింది! మీ కొత్త స్నేహితులను కలవండి. అద్భుతంగా జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ది ఆర్చీస్ తారాగణాన్ని మీకు అందిస్తున్నాం .. అంటూ ఆర్టిస్టులంద‌రినీ ప‌రిచ‌యం చేసారు.

ఆర్చీ ఆండ్రూస్ - వెరోనికా- బెట్టీ- జగ్ హెడ్ -రెగ్గీ సహా అతని స్క్వాడ్ సాహసాలు అనేక చలనచిత్రాలు .. కార్టూన్ సిరీస్ ల ద్వారా అమరత్వం పొందాయి. ఆర్చీ ఆండ్రూస్ పాత్ర మొదట పెప్ కామిక్స్ లో కనిపించింది.. పాప్ సంస్కృతిలో స్వతంత్ర పాత్రగా ప్రజాదరణ పొందింది.