బిబి4 : అవ్వ ఉంది.. అక్క పోయింది

Sun Sep 20 2020 13:41:04 GMT+0530 (IST)

BB4 : Gangavva is there .. Karate Kalyani is gone

ఈ వీకెండ్ లో బిగ్ బాస్ హౌస్ నుండి గంగవ్వ బయటకు రాబోతుందని అంతా భావించారు. ఆమె రెండు రోజుల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. ఆమె నాకు ఇక్కడ వశపడటం లేదు. ఇంటికి పోతా అంటూ గంగవ్వ కన్నీరు పెట్టుకోవడంతో అంతా కూడా అయ్యో పాపం అవ్వ అంటూ ఆమెకు ఓట్లు వేయడం తగ్గించారు. అయినా కూడా ఆమె మొదటే సేవ్ అయ్యింది. గంగవ్వ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడటంతో పాటు నాగార్జున క్లీయర్ గా ఆమెను అడిగిన సమయంలో నాకు బాగానే ఉంది. నేను ఉంటాను అంటూ ఆమె సమాధానం చెప్పింది. దాంతో ఆమెను అందరి కంటే ముందు సేవ్ చేసి ప్రేక్షకుల టెన్షన్ కూడా క్లీయర్ చేశారు.ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున గత వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిపై చాలా సీరియస్ అయ్యారు. కనీసం బోట్ లో ఉండేందుకు ప్రయత్నించలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలిమినేషన్ ను సీరియస్ గా తీసుకోవాంటూ బిగ్ బాస్ హెచ్చరించినా కూడా మీ 8 మంది పట్టించుకోలేదు. లెక్కలు వేసుకుని మరీ మీరు దిగారు అంటూ అందరిపై నాగార్జున సీరియస్ అయ్యాడు. ఎలిమినేషన్ అంటే నేను ఎందుకు ఎలిమినేషన్ లో ఉండాలి అంటూ ఇతరులతో పోరాడాలి. అంతే కాని నేను ఉంటాను అంటూ త్యాగాలు చేసినట్లుగా ఫీల్ అయ్యి ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వడం ఏంటీ అన్నాడు. నోయల్ ను ఈ విషయంలో నాగార్జున చాలా సీరియస్ గా మందలించాడు. ఆ తర్వాత నాగార్జున ఇంటి సభ్యులందరి మనసులో హీరో ఎవరు జీరో ఎవరు అనే విషయాన్ని తెలుసుకునేందుకు టాస్క్ పెట్టాడు.

ఆ సమయంలో అమ్మ రాజశేఖర్ మాస్టర్ ను లాస్య విలన్ అంటూ అతడి ప్రవర్తనపై మచ్చ తెచ్చేలా కామెంట్ చేసింది. దాంతో ఆయన చాలా ఫీల్ అయ్యాడు. మోకాళ్లపై పడి నన్ను పంపించండి అంటూ ఆయన వేడుకున్నాడు. ఆ సమయంలో అంతా కూడా ఆయన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో దివి మరియు లాస్యల మద్య వాదన ముదిరింది. నా విషయాన్ని నువ్వు చెప్పడం ఏంటీ అంటూ లాస్యను దివి షటప్ అంది. ఇద్దరి మద్య కాస్త వాతావరణం సీరియస్ అయ్యి లాస్య కన్నీరు పెట్టుకుంది. చివర్లో  ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ కరాటే కళ్యాణి ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించాడు. ఆమె ను బయటకు పంపించి పలువురు కంటెస్టెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో అవ్వ సేవ్ అవ్వగా అక్క ఎలిమినేట్ అయ్యింది.