ఇంత డల్ గా వస్తే ఎలా లీడర్?

Wed Sep 11 2019 13:10:16 GMT+0530 (IST)

ఇంకో 48 గంటల్లో నాని గ్యాంగ్ లీడర్ సందడి మొదలవుతుంది. నిన్న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం తప్పించి ప్రమోషన్ విషయంలో మైత్రి మరీ దూకుడుగా వెళ్ళకపోవడం న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. ఒకపక్క అడ్వాన్స్ బుకింగ్ యాప్స్ లో కనీసం సగం కూడా హాళ్లు నిండకపోవడం వాళ్ళ ఖంగారుకు మరో కారణంగా చెప్పొచ్చు. సాహో తర్వాత రెండు వారాల వ్యాక్యూమ్ ని గ్యాంగ్ లీడర్ సరిగా వాడుకోవడం లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలోనూ బలంగా వినిపిస్తున్నాయి.నానికున్న ఇమేజ్ కి మార్కెట్ కి సరిగ్గా పబ్లిసిటీ చేస్తే అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయి. కానీ నిర్మాతలు ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. ఎంత మౌత్ టాక్ మీద ఆధారపడ్డ కంటెంట్ అయినప్పటికీ అది బయటికి రావాలన్నా మొదటి రెండు మూడు రోజులు సాధారణ పబ్లిక్ సపోర్ట్ అవసరం. వాళ్ళు ముందుగా సినిమా చూడాలంటె ఆ స్థాయిలో ఆసక్తి కలిగేలా ఏదైనా ప్రమోషన్ ప్లాన్ చేయాలి.  

ఇదే సంస్థ రెండు నెలల క్రితం రిలీజ్ చేసిన డియర్ కామ్రేడ్ టైంలో ఎంత హడావిడి చేసారో ఇంకా గుర్తే. నాలుగు రాష్ట్రాలు చుట్టేసి మ్యూజికల్ ఈవెంట్స్ పేరుతో మాములు రచ్చ చేయలేదు. ఫస్ట్ వీకెండ్ కామ్రేడ్ మంచి వసూళ్లు తెచ్చుకోవడానికి హెల్ప్ అయ్యింది ఇదే. పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కథ ఇంకోలా ఉండేది కానీ కామ్రేడ్ ఫైనల్ గా నిరాశనే మిగిల్చాడు. కానీ గ్యాంగ్ లీడర్ విషయంలో అలాంటి జోష్ ఏమి కనిపించడం లేదు.

నాని కెరీర్ మొత్తంలో ఇంత లో హైప్ తో విడుదలవుతున్న మూవీ ఇదేనని ట్రేడ్ సైతం అభిప్రాయపడుతోంది. విక్రమ్ కుమార్ ఎంచుకున్న డిఫరెంట్ కాన్సెప్ట్ కార్తికేయ విలనీ లేడీ గ్యాంగ్ ఎలిమెంట్ వీటిలో దేనినీ గ్యాంగ్ లీడర్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవడం లేదు. చిరంజీవి కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయిన టైటిల్ పెట్టుకున్న నాని సినిమా వ్యవహరించే తీరు ఇది కాదని మెగా ఫాన్స్ సైతం దీని విషయంలో అసంతృప్తిగా ఉండటం గమనార్హం