రియల్ లైఫ్ లో ఏక్ విలనా! ఏకైక హీరోనా?

Thu Jul 07 2022 12:00:01 GMT+0530 (IST)

Galliyan Returns Song Ek Villain Returns

బాలీవుడ్ లో ఖాన్ ల పనైపోయిందన్న చర్చ ఇటీవల వేడెక్కిస్తోంది. సరైన సక్సెస్ రేటు లేకపోవడం ఖాన్ ల త్రయానికి ముప్పు గా మారుతోంది. దానికి తోడు వయసు యాభైలు దాటిపోయి 60 కి చేరువవుతుంటే ఇక ఓల్డేజీ లో వెటరన్ స్టార్లుగానే వీళ్లు స్థిరపడాల్సి ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ లో యంగ్ హీరోలతో పోటీని తట్టుకోవడం అంత సులువేమీ కాదు.చూస్తుంటే సల్మాన్ లాంటి స్టార్ కి బోనీ తనయుడు యంగ్ హీరో అర్జున్ కపూర్ కాంపిటీషన్ గా మారేట్టున్నాడు! ఇటీవలి కాలంలో అతడి మేకోవర్ ఆ రేంజులోనే ఉంది మరి. అర్జున్ లుక్ ఇప్పుడు పూర్తిగా మారింది. అతడిలో మ్యాన్లీ నెస్... రొమాంటిక్ యాటిట్యూడ్ మరో లెవల్లో ఉన్నాయి. దానికి తోడు ఎంతో ఎనర్జిటిక్ గా కూడా కనిపిస్తున్నాడు. వరుసగా క్రేజీ కథాంశాల్ని ఎంచుకుని ఒక్కో మెట్టు ఎక్కేందుకు కృషి చేస్తున్నాడు. ఎదిగేవాళ్లను ప్రోత్సహించడం తప్పు కాదు. అటు తన తండ్రి గారైన బోనీకపూర్ అండ పుష్కలంగా లభించగా.. అతడితో పాటు బాలీవుడ్ మీడియా కూడా నెమ్మదిగా అర్జున్ కి సపోర్ట్ నివ్వడం ప్రారంభించింది.

నిజానికి అర్జున్ .. తనకంటే వయసులో పెద్దది  అయిన మలైకా అరోరాఖాన్ తో ఎఫైర్ సాగించడం బోనీకి అస్సలు ఇష్టం లేదు. సల్మాన్ సోదరుడైన ఆర్భాజ్ భార్యతో అర్జున్ ఎఫైర్ బోనీకి అస్సలు ఇష్టం లేదు. సల్మాన్ ఖాన్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెలిగిన బోనీ జీ ఈ విషయంలో చాలా కలతకు గురయ్యారని కూడా ముంబై మీడియా కథనాలు వెలువరించింది.

కానీ చివరికి విధిరాతను ఎదుర్కోక తప్పలేదు. మలైకాతో అర్జున్ కపూర్ సాన్నిహిత్యంలో మార్పు లేదు. దాంతో పాటే ఖాన్ లకు ధీటుగా ఎదగాలన్న పట్టుదలను కనబరుస్తున్నాడు. ఏది ఏమైనా రియల్ లైఫ్ లో అతడు ఏక్ విలన్ అవుతాడా?  లేక ఏకైక హీరోనే అవుతాడా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.

అన్నట్టు..  ఏక్ విలన్ రిటర్న్స్ కోసం అర్జున్ కపూర్ చాలా హార్డ్ వర్క్ చేసాడు. మోస్ట్ అవైటెడ్ మూవీగా టీజర్ పోస్టర్లు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ట్రైలర్ క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ హిట్. దిశా పటాని- జాన్ అబ్రహం.. ఒక జంటగా కనిపిస్తుండగా.. అర్జున్ కపూర్ -తారా సుతారియా జంటగా నటించారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లోకి  గల్లియన్ రిటర్న్స్ అంటూ సాగే మూవీలోని మొదటి పాటను షేర్ చేయగా వైరల్ అయ్యింది.

వీడియో ఆద్యంతం ఘాటైన శృంగారం భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. వీటన్నిటినీ మించి గల్లీయాన్ పాటలో బోలెడన్ని ట్విస్టులను ఎలివేట్ చేయడం ఆసక్తిని కలిగించింది. ఇందులో దిశా పటానీ అర్జున్ వైపా లేక జాన్ వైపా? అన్న సందేహాన్ని ఈ సాంగ్ రేకెత్తించింది. అంతగా ట్విస్టులతో పాటను తెరకెక్కించడం ఆసక్తికరం. కొన్ని వరుస హిట్లతో దూసుకొచ్చిన అర్జున్ కపూర్ తదుపరి ఏక్ విలన్ సీక్వెల్ తో హిట్టు కొడితే కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కినట్టే.