Begin typing your search above and press return to search.

గాలి సంప‌త్ గాలి వేషాలేంటో చూడాలంటే!

By:  Tupaki Desk   |   6 March 2021 7:30 AM GMT
గాలి సంప‌త్ గాలి వేషాలేంటో చూడాలంటే!
X
వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో ప్ర‌యోగాలు చేసి కూడా హిట్లు కొడుతున్నాడు శ్రీ‌విష్ణు. ఒడిదుడుకులు ఉన్నా త‌న అభిరుచికి త‌గ్గ క‌థ‌ల్ని ఎంచుకుని కొత్త‌ద‌నం కోసం ప్ర‌య‌త్నించే హీరోగా అత‌డి పేరు మార్కెట్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తుండ‌గా.. లవ్ ‌లీ సింగ్ నాయిక‌గా న‌టిస్తోంది. అనీష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అనీల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్.కృష్ణ నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే పోస్ట‌ర్లు సింగిల్స్ తో టీమ్ ప్ర‌మోష‌న్స్ లో స్పీడ్ పెంచింది. ఈ సినిమా నుంచి `పాప ఓ పాప.. నీ పేరు తలచి నేను మజునూనయ్యానే` సాంగ్ ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ పాట‌ను విడుద‌ల చేయ‌డంతో రౌడీ ఫ్యాన్స్ వైర‌ల్ గా షేర్ చేశారు.

ఆదివారం (7 మార్చి) సాయంత్రం హైద‌రాబాద్ జేఆర్సీ సెంట‌ర్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. వేదిక‌పై రాజేంద్రుడు స‌హా శ్రీ‌విష్ణు అండ్ టీమ్ సంద‌డి చేయ‌నున్నారు. ఈ చిత్రం మార్చి11న విడుదల కానుంది.

తండ్రీ కొడుకుల ఎమోషనల్ డ్రామాతో ఈ మూవీ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని టీమ్ చెబుతోంది. అనుకోని ప్రమాదంలో మాట కోల్పోయిన సంపత్ బావి లో పడి ప్రమాదంలో ఉంటాడు. అక్కడి నుంచి అసలు సంపత్ ఎలా బయటపడ్డాడు? అలాగే త‌ప్పిపోయిన‌ తండ్రిని వెతికే టైమ్ లో కొడుకు పడే ఆవేదన ఎలాంటిది? అనేది తెర‌పై చూపించ‌నున్నార‌ట‌. రఘుబాబు- తనికెళ్ల భరణి- సత్య- శ్రీకాంత్ అయ్యంగర్ తదితర ముఖ్య పాత్రల్లో కనిపించ‌నున్నారు. మ‌రో ఐదు రోజుల్లో రిలీజ్ కి వ‌స్తున్న ఈ సినిమా రిజ‌ల్ట్ పై టీమ్ ఆస‌క్తిగా వేచి చూస్తోంది.