బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న మరో సౌత్ స్టార్

Sun Jun 26 2022 16:00:01 GMT+0530 (IST)

GV Prakash Bollywood Entry

ఒకప్పుడు సౌత్ హీరోలను మరియు టెక్నీషియన్స్ ను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్స్ చిన్నచూపు చూసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. బాలీవుడ్ లో సౌత్ స్టార్స్ కు మరియు టెక్నీషియన్స్ కు మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. మనవాళ్లు హీరోలుగా హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.. అంతే కాకుండా హిందీ సినిమాలకు మన టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.తాజాగా మరో సౌత్ సంగీత దర్శకుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆయన వరుసగా హీరోగా మరియు సంగీత దర్శకుడిగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో కంగనా తో వర్క్ చేసే అవకాశం వచ్చిందంటూ అధికారికంగా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.

జీవీ ప్రకాష్ మరియు కంగనా ల సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీ ని జీవీ ప్రకాష్ షేర్ చేసి కంగనాతో వర్క్ చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. జీవి ప్రకాష్ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కొన్ని ప్రశ్నలు కూడా జనాల్లో చర్చ జరుగుతున్నాయి.

కంగనా తో వర్క్ చేయబోతున్నట్లుగా ప్రకటించిన జీవీ ప్రకాష్ ఇంతకు ఆమె తో నటించబోతున్నాడా లేదంటే ఆమె సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నాడా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ కంగనా సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించబోతున్నాడు అనేది తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

మరి కొందరు జీవీ ప్రకాష్ వెళ్లి వెళ్లి కంగనాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంను తప్పుబడుతున్నారు. ఈమద్య కాలంలో కంగనా నటించిన సినిమాలు దాదాపుగా అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఆమెతో సినిమాలు అంటేనే టెక్నీషియన్స్ మరియు నటీ నటులు కాస్త దూరం ఉంటున్నారట. ఇలాంటి సమయంలో జీవీ ప్రకాష్ ఆమెతో వర్క్ చేయబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తికరంగా ఆ ప్రాజెక్ట్ వైపు చూస్తున్నారు.