నెట్టింట ఊహించని నెగటివిటీ ఎదుర్కొంటున్న గుంజన్ సక్సేనా.. కారణం అదేనా?

Mon Aug 03 2020 13:20:18 GMT+0530 (IST)

GUNJAN SAXENA The Kargil Girl Trailer

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటించిన రెండవ చిత్రం 'గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్'. సోషల్ మీడియాలో ట్రైలర్ విడుదల అయ్యేవరకు ఈ సినిమా గురించి ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పడింది. కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదల అయిందో అప్పటి నుండి ఈ ట్రైలర్ విపరీతమైన నెగటివ్ బజ్ ను ఎదుర్కుంటుంది. గుంజన్ సక్సేనా ట్రైలర్ బాగుంది. సినిమా చిత్రీకరణ దశలో కూడా మంచి పాజిటివ్ అభిప్రాయాలు క్రియేట్ చేసింది. మొన్నటి వరకు దేశవ్యాప్తంగా ప్రజలు సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూసారు కూడా.. కానీ పరిస్థితి రివర్స్ అయిపోయింది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కావాల్సి ఉంది.కానీ ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో ఎందుకు నెగటివ్ అవుతుంది. అంటే దానికి కారణం కూడా ఉందని అంటున్నారు. యూట్యూబ్ లో లైక్స్ తో పాటు డిస్ లైక్స్ కూడా అదే రేంజిలో పొందుతుంది. వీటన్నిటికీ కారణం.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అకాల మరణంతో ఏర్పడిన ‘నేపాటిజం’. నెపోటిజమ్ పై ఉన్న కోపంతో గుంజన్ సక్సేనా ఈ విషయంలో బాగా నెగటివిటీ పొందుతుంది. ఎందుకంటే కరణ్ జోహార్ జాన్వి కపూర్ లు ఇందుకు ముఖ్య పాత్రధారులని అంటున్నారు. దిల్ బేచారాకి ఎంత పాజిటివ్ వచ్చిందో దీనికి అంత నెగటివ్ మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి కరణ్ జోహార్ నిర్మాత కావడం ప్రజలలో ఈ చర్చకు తావిచ్చింది.

గుంజన్ సక్సేనా ఈ నెల 12న నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో విడుదల కానుంది. మరి విడుదల అయినప్పుడు కూడా ఇదే నెగటివిటీ ఎదుర్కొంటే మాత్రం ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ పై ప్రభావం చూపుతుంది. అదే జరిగితే ఆయన నిర్మాణం ఇకపై దెబ్బ తింటుందని సినీవర్గాలలో టాక్. ఇదే కొనసాగితే అందరికీ ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. షాకింగ్ అంశం ఏమిటంటే.. సినిమా దేశభక్తి గురించి ఉన్నప్పటికీ నెగటివ్ బజ్ జరుగుతుంది. గుంజన్ సక్సేనా: కార్గిల్ గర్ల్ భారతదేశపు మొదటి మహిళా పైలట్ బయోపిక్. శరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా విడుదల పై ముందు ప్రభావం ఎలా ఉండబోతుందో..!