'ఫ్యామిలీ మ్యాన్' రాజీ క్యారెక్టర్ తో ఫుల్ మూవీ..?

Wed Jun 16 2021 17:00:01 GMT+0530 (IST)

Full movie with Family Man raji character

దక్షిణాది అగ్రనటి అక్కినేని సమంత.. ఈ ఏడాది సినిమా చేయలేదు కానీ వెబ్ సిరీస్ తో మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలే 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సెకండ్ సీసన్ తో డిజిటల్ ఎంట్రీ అదరగొట్టింది. అయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు సమంత టాపిక్ లేకుండా ఏ వార్త ఉండదనే చెప్పాలి. ఎందుకంటే మొదటిసారి సమంత అవుట్ అండ్ అవుట్ బోల్డ్ క్యారెక్టర్ చేయడంతో అమ్మడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పదేళ్లక్రితం ఏం మాయచేసావే సినిమాతో డెబ్యూ చేసిన సమంతను ఫ్యామిలీ మ్యాన్ లో చూస్తే పక్కా షాకవ్వాల్సిందే.ఇంతవరకు సమంత నుండి ఎక్సపెక్ట్ చేయని రేంజిలో బోల్డ్ నెస్ కనబరిచింది. ఎప్పటినుండో సమంత డిజిటల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు దిమ్మతిరిగే ట్రీట్ ఇచ్చింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు సామ్ నుండి ఎక్సపెక్ట్ చేయనివి చాలా ఉన్నాయి. ఎలా అంగీకరించిందో కానీ యాక్షన్ మాత్రం అదరగొట్టింది అనిపిస్తుంది. సామ్ ఇదివరకు చెప్పినట్లుగానే ఫేవరేట్ బోల్డ్ రోల్.. అని నిరూపించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మార్పులు చూస్తుంటే వయసుతో సంబంధం లేకుండా హీరోయిన్స్ బోల్డ్ రోల్స్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ బోల్డ్ రోల్స్ చేస్తుంటారు. అయితే సమంత కూడా గ్లామర్ రోల్స్ చేసింది కానీ మరీ ఇంత బోల్డ్ ఎప్పుడు చేయలేదు.

అయితే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ తో వారు సంచలనం సృష్టించారని చెప్పాలి. వారు సమంతను రాజీ క్యారెక్టర్ లో చూపించిన విధానం అద్భుతం. అందుకే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ గురించి కాకుండా మేకర్స్ తదుపరి ప్రాజెక్ట్ గురించి క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతోంది. ఏంటంటే.. డైరెక్టర్స్ రాజ్ డీకే ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ రాజీ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అది నిజమో కాదో గాని ఈసారి సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ సమంతతోనే చేయించాలని ప్లాన్ అని తెలుస్తుంది. చూడాలి మరి ఈ వార్తలో నిజముందో లేదో మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.