PSPK న్యూలుక్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్

Fri Sep 30 2022 15:25:25 GMT+0530 (India Standard Time)

Full kick for PSPK new look fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో సోషియా ఫాంటసీ చిత్రం 'హరిహరవీరమల్లు' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా చిత్రీకరణ ప్లానింగ్ ప్రకారం జరగడం లేదు. దీంతో పీకే షెడ్యూల్ ని బట్టి గ్యాప్ ఇచ్చుకుంటూ  తెరకెక్కించాల్సి వస్తోంది.గత రెండు నెలలు గా షూటింగ్ కి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా వ్యక్తిగత పనుల మీద అమెరికా టూర్ వెళ్లడంతో  మరింత ఆలస్యమవుతోంది. తాజాగా పీకే   USA నుండి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. తిరిగి యాధవిధిగా షూటింగ్ కి సమయాత్తం అవుతున్నారు. దీనిలో భాగంగా షూట్ కి సంబంధించి వర్క్ షాప్స్ చేయాల్సి రావడంతో ఆ పనుల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా పవన్ న్యూ లుక్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో పవన్ రెడ్ కలర్ టీషర్ట్...బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్..కాళ్లకి వైట్ షూస్ ధరించి న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో పీకే  పూర్తిగా యంగ్ లుక్ లో కి మారిపోయాడు. పీకేని ఇలాంటి లుక్ లో బయట చూసి చాలా కాలమవుతోంది. కొంత కాలంగా కుర్తాలు..సంప్రదాయ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడ కనిపించినా కుర్తా తప్పనిసరిగా మారిపోయింది. రాజకీయ అవసరాల నిమిత్తం పవన్ ఆరకమైన ఆహార్యంలోకి మారాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్టైలిష్ పద్దతికి పూర్తిగా దూరమయ్యారు. కేవలం సినిమాల్లో మినహా బయట కనిపించడం లేదు. ఇదిగో ఇప్పుడిలా చాలా కాలానికి    న్యూలు లో ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తున్నాడు.

పవన్ ఇలా చూసుకుని అభిమానులు మురిసిపోతున్నారు. పవన్ పక్కనే సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కూడా నుంచున్నారు. ఇద్దరు కలిసి కెమెరాకి ఫోజులిచ్చారు. బ్యాక్ గ్రౌండ్ లో హరిహర వీరమల్లు వర్క్ షాప్స్ బోర్డ్ కనిపిస్తుంది. దిన్ని బట్టి ఇద్దరు వర్క్ షాప్ బిజీ అనంతరం రిలాక్స్ సమయంలో ఇలా క్యామ్ కి చిక్కారు.

పీకే యంగ్ గా మారిపోయాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఇక వీరమల్లు షూటింగ్ వర్క్ షాప్ అనంతరం తిరిగి  పున ప్రారంభం కానుంది. అన్ని పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది మార్చిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్  సుజీత్ దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్‌టైనర్‌కు సంతకం చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుదని సమాచారం.  ఈ చిత్రాన్ని డివివి దానయ్య- త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించనున్నారుట. అలాగే తమిళ చిత్రం 'వినోదయ  సీతమ్' రీమేక్ కోసం కూడా పవన్  చర్చలు జరుపుతోన్న సంగతి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.