'చెక్' తో ఫుల్ హ్యాపీ.. రకుల్ తీరుపై ట్రోల్స్

Mon Mar 01 2021 05:00:02 GMT+0530 (IST)

Full happy with 'check' .. Trolls on Rakul trend

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్ గా స్టార్ లకు సూపర్ స్టార్ లకు మోస్ట్ వాంటెడ్ గా పేరు దక్కించుకున్న రకుల్ తక్కువ సమయంలోనే డల్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తూ ఉన్న ఈ అమ్మడు అవి కూడా పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలే ఉంటున్నాయని టాక్ వినిపిస్తుంది. చెక్ సినిమా లో రకుల్ కీలక పాత్రలో కనిపించింది. నితిన్ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ అంటే ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే ఊహించుకున్నారు. కాని లాయర్ పాత్రలో రకుల్ సో సో గానే అనిపించింది. కథలో కీలకం అయినా కూడా హీరోయిన్ గా అనుకోవడానికి లేకుండా పోయింది.హీరోతో రొమాన్స్ లేదు.. కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు దాంతో చెక్ సినిమాలో రకుల్ పాత్ర గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చెక్ సినిమా గురించి రకుల్ మాట్లాడుతూ తన పాత్రకు మంచి స్పందన వస్తుంది అంటూ ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. మౌత్ టాక్ తో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని రకుల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. చెక్ సినిమాలో రకుల్ పాత్ర పెద్దగా లేనే లేదు. అయినా కూడా సినిమా టాక్ పై సంతోషంగా ఉన్నానంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకప్పుడు సూపర్ స్టార్ రేంజ్ హీరోలతో నటించిన రకుల్ ఇప్పుడు చెక్ సినిమాలో చిన్న పాత్రను పోషించి దానికే ఇంత హ్యాపీ ఫీల్ అవ్వడం ఏంటో అంటూ మరి కొందరు ఆమె తీరును ట్రోల్ చేస్తున్నారు. తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ వెళ్లిన ఈ అమ్మడికి అక్కడ వరుసగా ఆఫర్లు అయితే వస్తున్నాయి కాని మెయిన్ లీడ్ గా మాత్రం పెద్ద సినిమాలకు ఆపర్లు రావడం లేదు. ఆ చాన్స్ ల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా రకుల్ చెబుతోంది.