Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ మ్యాజిక్.. రావిపూడి నీరసం!

By:  Tupaki Desk   |   8 Feb 2020 6:44 AM GMT
త్రివిక్రమ్ మ్యాజిక్.. రావిపూడి నీరసం!
X
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాల మధ్య భారీ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మూడు నెలల ముందు ఆరంభమైన ఈ పోటీ నిన్న మొన్నటి వరకూ కూడా కొనసాగింది. ప్రచారంలో విషయాలు ఎలా ఉన్నప్పటికీ ఈ సంక్రాంతి విజేత మాత్రం నిస్సందేహంగా అల్లు అర్జున్ సినిమానే.

ఓవర్సీస్ లాంటి ఒకటి రెండు ఏరియాల లో నష్టాలను మినహాయిస్తే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా విజయవంతమైన సినిమా అని చెప్పాలి. అయితే ప్రచారం చేసుకుంటున్నట్టుగా బ్లాక్ బస్టర్ కా బాప్.. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మాత్రం కాదు. సంక్రాంతి సీజన్ ముగిసిపోయినప్పటికీ ఇంకా సంక్రాంతి సినిమాలపై చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రెండు సినిమాలను పోల్చి చూస్తూ కొన్ని ఆసక్తికరమైన అభిప్రాయాలను నెటిజన్లు వెలిబుచ్చుతున్నారు.

'అల వైకుంఠపురములో' సినిమా విజయం ఒక టీమ్ వర్క్ వల్లే లభించిందని.. చక్కని కుటుంబ అనుబంధాలు ఉండే కథ.. ఆ కథను తెరపై సున్నితంగా అవిష్కరించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే 'అల వైకుంఠపురము లో' టీమ్ అందరూ సమిష్టిగా కృషి చేసి విజయం లో తమవంతు పాత్ర పోషించారు.

అయితే 'సరిలేరు నీకెవ్వరు' విషయమే తీసుకుంటే కథ.. దర్శకత్వం... మ్యూజిక్ ఇలా అన్ని డిపార్ట్ మెంట్లు వీక్. సినిమా మొత్తం మహేష్ బాబు స్టార్డమ్ పైన రన్ అయింది. మహేష్ బాబు తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'అల వైకుంఠపురములో' హీరో ఎవరైనా హిట్ అయి ఉండేదని.. 'సరిలేరు నీకెవ్వరు' మాత్రం మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని.. వేరే హీరో అయితే ఫ్లాప్ అయి ఉండేదని అంగీకరించాలని అంటున్నారు.

దర్శకులను పోల్చి చూస్తే త్రివిక్రమ్ తన మ్యాజిక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని.. అదే అనిల్ రావిపూడి మాత్రం మహేష్ లాంటి స్టార్ తో నీరసంగా సినిమా తీసి నిరాశ పరిచాడని అంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఎక్కువమంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.