Begin typing your search above and press return to search.

ర‌ణ‌వీర్ తో స్నేహం.. మ్యాడీకి అభిమాని వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   7 Oct 2022 11:30 PM GMT
ర‌ణ‌వీర్ తో స్నేహం.. మ్యాడీకి అభిమాని వార్నింగ్‌!
X
త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట‌న‌తో దేశంలోనే పాపుల‌ర్ న‌టుడిగా వెలిగిపోతున్నాడు ఆర్.మాధ‌వ‌న్. జ‌న్మ‌తః త‌మిళుడే అయినా తెలుగు హిందీ బెల్ట్ లోనూ అత‌డికి వీరాభిమానులున్నారు. తెలుగు హీరోలు మ్యాడీతో ప‌ని చేసేందుకు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తుంటారు.

ఇటీవ‌లే మాధ‌వన్ (మ్యాడీ) దర్శకుడిగా మారి రూపొందించిన `రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌`లో తన పనిత‌నానికి ప్రశంసలు అందుకున్నాడు. న‌టుడిగా ద‌ర్శ‌కుడిగా అత‌డి ప‌నిని క్రిటిక్స్ ప్ర‌శంసించారు.

మాధ‌వ‌న్ వ్య‌క్తిగ‌తంగా స్పోర్ట్స్ ల‌వ‌ర్. అత‌డి కుమారుడు కూడా క్రీడ‌ల్లో రాణిస్తున్నాడు. ప్ర‌స్తుతం మ్యాడీ NBA అబుదాబి గేమ్స్ 2022కి హాజర‌య్యారు. ఆసక్తికరంగా అతను పరిశ్రమలోని పవర్ హౌస్ రణవీర్ సింగ్ తో క‌లిసి గేమ్ వీక్షించాడు. గురువారం నాడు మాధవన్ సోషల్ మీడియాలో రణ్‌వీర్ తో క‌లిసి ఉన్న ఓ సెల్ఫీని షేర్ చేసాడు.ఈ ఫోటోలో ఆ ఇద్ద‌రి అనుబంధం ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఒక‌ర‌కంగా అభిమానుల‌ను అబ్బురపరిచారు.

రణవీర్ పసుపు - ఆకుపచ్చ రంగు దుస్తులతో త‌న‌దైన వైవిధ్య‌మైన‌ స్టైల్లో వెరైటీ సన్ గ్లాసెస్ తో కనిపించాడు. మరోవైపు మాధవన్ కూల్ సన్ గ్లాసెస్ తో బ్లాక్ డ్రెస్ లో సింపుల్ గా క‌నిపించాడు. మిలియన్ డాలర్ల చిరునవ్వుల‌తో ఈ సెల్ఫీలో ఆ ఇద్ద‌రూ మెరిశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ... లవ్ యు మై బ్రో.. @RanveerOfficial @NBA అని మ్యాడీ రాశారు. రణవీర్ క్యూట్ స్మైలీ ఎమోజీలను కామెంట్స్ లో షేర్ చేశారు.

అయితే ర‌ణ‌వీర్ తో క‌లిసి ఉన్న ఫోటోని మ్యాడీ షేర్ చేయ‌గానే వెంటనే ఒక నెటిజ‌నుడు అతన్ని అనుసరించకుండా ఉండమని బెదిరించారు. ``ఇప్పుడు నేను మిమ్మల్ని అనుసరించడం లేదు..`` అని రాసాడు. మాధవన్ దానికి స్టైల్ గా స‌రే బ్రో అంటూ జవాబిచ్చాడు. మరొక వినియోగదారు ప్ర‌శ్నిస్తూ..`` అయ్యో... మీరు ముందు వరుస(గేల‌రీ)లో లేరు.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కాదు... ఒక సాధారణ మనిషిగా ఉండటం ఎలా అనిపిస్తుంది!!`` అని మాధవన్ ని అడిగారు. దానికి అత‌డు బదులిస్తూ ``ఎల్లప్పుడూ సామాన్యుడినే. అయినా కూడా స్టార్ కావడం ఇష్టం`` అని అన్నారు. అభిమానులలో ఒకరు ``ఒకే ఫ్రేమ్ లో ఇద్ద‌రు ఉత్తమం`` అని రాశారు. ఈ కాంబో మ్యాజిక్ ప‌ని చేస్తుంది.. దయచేసి కలిసి సినిమా చేయండి`` అని మరో అభిమాని వ్యాఖ్యానించారు. నిజానికి ర‌ణ‌వీర్ సింగ్ ని బాలీవుడ్ మాఫియాలో అంత‌ర్భాగంగా చూసే నెటిజ‌నులు అత‌డిని బాయ్ కాట్ చేస్తున్నారు. అందుకే మాధ‌వ‌న్ అత‌డితో స్నేహం చేయ‌కూడ‌ద‌ని నెటిజ‌న్ హెచ్చ‌రించాడు. కానీ మాధ‌వ‌న్ త‌న ప‌రిశ్ర‌మ స్నేహితుల‌ను దూరం చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మాధవన్ ఇటీవల `ధోఖా: రౌండ్ డి కార్నర్‌`లో అపరశక్తి ఖురానా - దర్శన్ కుమార్ తో క‌లిసి కనిపించారు. మరోవైపు రణవీర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్- పూజా హెగ్డేలతో క‌లిసి రోహిత్ శెట్టి సర్కస్ లో న‌టిస్తున్నాడు. అతను `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ`లోను న‌టిస్తున్నాడు. అలియా భట్- ధర్మేంద్ర- జయా బచ్చన్- షబానా అజ్మీలాంటి దిగ్గ‌జాలు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.