స్నేహానికి సిసలైన అర్థం చెప్పిన టాలీవుడ్ స్టార్లు వీళ్లే

Sun Aug 01 2021 22:00:01 GMT+0530 (IST)

Friendship in Tollywood

తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఆప్తంగా మెలిగేది  ఒక్క స్నేహితుడు మాత్రమే.  ఆ స్నేహం కూడా ఎంతో నిజాయితీగా ఉండాలి. స్నేహితులు ఎంత మంది ఉన్నా బెస్ట్ ప్రెండ్ అంటూ ఒకరుంటారు. ఎంత మందితో ఎలాంటి రిలేషన్ షిప్ కొనసాగించినా బెస్ట్ ప్రెండ్ తో మాత్రం ఎప్పుడు నిజాయితీగా మెలగాలి. అప్పుడే ఆ ప్రెండ్ షిప్ కలకాలం కొనసాగుతుంది. ఎన్ని అవరోధాలు వచ్చినా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎలాంటి మన్పస్పర్ధలు తలెత్తినా బెస్ట్ ప్రెండ్ మాత్రం ఎప్పటికీ వెంటే ఉంటాడు. కాగా నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్  హీరోలలో అత్యంత క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ గురించి  ఓ లుక్కేస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది.టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి - కింగ్  నాగార్జున స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు చాలా కాలంగా పరిశ్రమలో క్లోజ్ ప్రెండ్స్.   రెగ్యులర్ గా మీట్ అవుతుంటారు. అప్పుడప్పుడు  ఆ రెండు కుటుంబాల సభ్యలు  గెట్ టుగెదర్ లు ఏర్పాటు చేసుకుంటారు.  వారిద్దరి మధ్య ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత బాండింగ్ ఉంది. ఇటీవలే ఓ జర్నలిస్ట్ దగ్గర చిరంజీవి నన్నే నాగార్జున అనుకోవచ్చుగా అని అన్నారంటే! చిరంజీవి నాగార్జునకు ఎంత వెయిట్ ఇస్తారు అన్నది మరోసారి బయట పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాత్రికుడు త్రివికమ్ స్నేహం గురించి ప్రత్యేకించాల్సి పనిలేదు. ఇద్దరి బాండింగ్ గురించి పవన్ అభిమానుల సహా ప్రేక్షకులకు బాగా తెలుసు. వారు ఒకరికొకరు జీవితంలోని చీకటి కోణాలను చక్కగా వివరిస్తుంటారు.  ఒకరినొకరు ఎంతగానో  విశ్వసిస్తారు.  హృదయంలో ఒకరికొకరు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. అలాగే అడివి శేష్ - నటుడు వెన్నెల కిషోర్ మంచి స్నేహితులు. పరిశ్రమకు రాక ముందునుంచే ఇద్దరు చాలా క్లోజ్. ఎంత బిజీగా ఉన్నా  ఇరువురు తరుచూ కలిసికుంటారు.

అక్కినేని కోడలు సమంత - డిజైనర్ శిల్పా రెడ్డి కూడా గొప్ప స్నేహితులు. సోషల్ మీడియా వేదికగా  ఎప్పటికప్పుడు ఇరువురు కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటుంటారు. ఆఫోటోలే వాళ్ల స్నేహం ఎంత స్ట్రాంగ్ అన్నది చెబుతుంటాయి. ఇక పార్టీలంటూ చేసే హడావుడి గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే టాలీవుడ్ హంక్  రానా - మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఆన్ సెట్స్ లోనే ఇద్దరు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. తారక్ - చరణ్ మధ్య స్నేహం ఎంతో గొప్పది. ఆ ఇద్దరూ కలిసి ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నారు. యూత్ స్టార్  నితిన్ - యంగ్ హీరో అఖిల్ స్నేహం  కూడా మంచి  స్నేహితులు. వీరంతా తమ బాండిగ్ ని ఎలివేట్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.