ట్రైలర్ టాక్: ఫోర్ మోర్ షాట్స్.. వేడెక్కించే బెడ్ రూమ్ సీన్లతో!

Wed Apr 01 2020 18:59:29 GMT+0530 (IST)

Four More Shots Please New Season Trailer

అమ్మాయిల స్వేచ్ఛా జీవనం .. ఇది ఎప్పుడూ హాట్ టాపిక్కే. నలుగురు పడతులు స్నేహం చేస్తే స్వేచ్ఛా జీవనంపై పోరాడితే .. సమాజాన్ని ఎదురిస్తే.. అటుపై సాగే సరాగాలేమిటన్న కథాంశాన్ని ఎంచుకుని ఇటీవలి కాలంలో టాలీవుడ్ ని పలువురు దర్శకులు హీటెక్కించే పని పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మరి కాస్త మసాలా దట్టించి గాళ్స్ వెస్ట్రన్ స్టైల్ లైఫ్ ని ప్రపంచానికి కాస్త ఘాటుగా హాటుగా మోటుగా చూపించబోతోంది అమెజాన్ ప్రైమ్.లిప్ లాక్ లు.. బెడ్ రూమ్ సీన్లు.. ఆ ఫోర్ గాళ్స్ వ్యవహారమేమిటా చూసి తీరాలన్నంత కసిగా అమెజాన్ వాళ్లు ఈ వెబ్ సిరీస్ ని వండి వారుస్తున్నారని తాజాగా రిలీజైన ట్రైలర్ చెబుతోంది. అమెజాన్ ప్రైమ్ సిరీస్ లలో ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ఇప్పటికే యూత్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో నలుగురు మహిళలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ సీజన్ 2 ఏప్రిల్ 17 నుండి ప్రసారం కానుంది. సయాని గుప్తా -కీర్తి కుల్హారీ- బని జె- మాన్వి గాగ్రూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రెండో సీజన్ హీటెక్కించేందుకు రెడీ అవుతోంది.

ఇక ఈ వెబ్ సిరీస్ కథాంశం చూస్తే.. నీతి నిజాయితీ గల ఒక యువతి జర్నలిజంలో పోరాడుతుంది. విడాకులు తీసుకున్న మహిళను సమాజంలో చిత్రీకరించిన తీరుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇక ఈ కథలోనే లెస్బియన్ ఫిట్‌నెస్ ట్రైనర్ కథేంటి? లైంగిక విముక్తి అనే టాపిక్ ని ఎంతవరకూ ఎలివేట్ చేసారు? అనేది తెరపై చూడాల్సిందే. ఈ సీజన్ ను ముంబై నుండి ఇస్తాంబుల్ వరకూ.. ఉదయపూర్ వంటి కొత్త నగరాల్ని ఆవిష్కరించనుంది. తాజా సీజన్ లో వేడెక్కించే కంటెంట్ కి ఏమాత్రం కొదవ  లేదు. ఘాటైన లిప్ లాక్ లు.. బెడ్ రూమ్ సన్నివేశాలతో అంతకంతకు హీట్ పెంచేస్తుందని అర్థమవుతోంది. లాక్ డౌన్ ముగిశాక సిరీస్ టెలీకాస్ట్ అవుతోంది. ఆదరణ ఎలా ఉంటుంది? అన్నది చూడాలి.