శివగామితో స్టేజ్ పై నుండే ఫైట్ చేసిన వనిత

Thu Jul 22 2021 06:00:01 GMT+0530 (IST)

Fought with Sivagami from the stage

ఈమద్య కాలంలో నటి వనిత విజయ్ కుమార్ గురించి మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక విషయం హాట్ హాట్ టాపిక్ గానే ఉంది. నటిగా ఒక వైపు నటిస్తూనే మరో వైపు బుల్లి తెర షో లతో బిజీగా ఉన్న వనిత విజయ్ కుమార్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నుండే వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ ఉండేది. ఇక ఆమె పెళ్లిల విషయంలో ఎప్పుడు వార్తల్లో నిలిచింది.గత ఏడాది ఆమె పెళ్లి సమయంలో జరిగిన చర్చ రచ్చ ఏ స్థాయిలో నెట్టింట హడావుడి జరిగిందో అందరికి తెల్సిందే. మీడియాలో ఆమె రచ్చ రచ్చ గా వ్యాఖ్యలు చేసింది. తన పెళ్లి గురించి విడాకుల గురించి న్యూస్ ఛానెల్ లో చర్చించిన వారి పట్ల అత్యంత కఠిన పదాలు వాడుతూ దూషించడం కూడా చేసింది. దాంతో ఆమె ను కొందరు తమిళ ఇండస్ట్రీ వారు కూడా తప్పుబట్టారు.

ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటీ అంటూ ఆమెను విమర్శించారు. ఆ తర్వాత ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజా పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లుగా ఆమె ప్రకటించడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేశారు. ఇక తాజాగా ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అయ్యే బిబి జోడీగల్ డాన్స్ షో లో పాల్గొంటుంది. బిగ్ బాస్ మాజీ కంటెంస్టెంట్స్ తో నిర్వహిస్తున్న ఈ డాన్స్ షో కు మంచి స్పందన వచ్చింది.

బి బి కంటెంస్టెంట్స్ ను జోడీలుగా తీసుకుని ఈ షో ను నిర్వహిస్తున్నారు. ఈ షో కు రమ్య కృష్ణ ఒక జడ్జ్ గా వ్యవహరిస్తుంది. తాజా ఎపిసోడ్ లో వనిత విజయ్ కుమార్ అమ్మవారి వేశంలో డాన్స్ చేసింది. ఆ డాన్స్ గురించి రమ్యకృష్ణ స్పందిస్తూ మేకప్ చాలా అద్బుతంగా ఉందని పేర్కొన్నారు. అయితే డాన్స్ లో మాత్రం అంత నైపుణ్యం కనిపించలేదని.. కొరియోగ్రాఫర్ ను పిలిచి ఇంకాస్త ఎక్కువ ప్రాక్టీస్ చేయించడంతో పాటు బాగా కంపోజ్ చేస్తే బాగుండేది అంటూ వ్యాఖ్యలు చేసింది.

ఆ సమయంలో వనిత విజయ్ కుమార్ కు కోపం వచ్చింది. మీరు జడ్జ్ మెంట్ ఇవ్వకుండా మీ వ్యక్తిగత అభిప్రాయంను చెబుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. నా డాన్స్ ను ఇతర కంటెస్టెంట్స్ తో పోల్చడం ఎంటీ అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసిన వనిత విజయ్ కుమార్ ఇంకాస్త గట్టిగానే రమ్యకృష్ణ పై విమర్శలు చేసింది. ఆ సమయంలో రమ్య కృష్ణ కూడా తీవ్రంగానే స్పందించింది.

జడ్జ్ మెంట్ ఎలా ఇవ్వాలో నాకు నేర్పించాల్సిన అవసరం లేదు అంటూ సీరియస్ అయ్యింది. నా సొంత అభిప్రాయం ను చెప్పడం జడ్జిమెంట్ కాదా అంటూ ప్రశ్నించింది. ఇతర కంటెస్టెంట్స్ తో పోల్చకుండా జడ్జ్ మెంట్ ఎలా ఇస్తారు.. అందరి డాన్స్ ను కంపైర్ చేసిన తర్వాతే జడ్జ్ మెంట్ ఇవ్వగలం కదా అంటూ రమ్యకృష్ణ అన్నారు.

ఇలా జడ్జ్ మెంట్ ఇవ్వడం ఇది కొత్తేం కాదని.. రమ్యకృష్ణ సీరియస్ గా మాట్లాడటంతో పాటు మరో జడ్జ్ చేసిన వ్యాఖ్యలతో వనిత విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహంతో అక్కడ నుండి వెళ్లి పోయింది. ప్రస్తుతం ఈ సంఘటన వీడియో నెట్టింట తెగ హడావుడి చేస్తోంది. ఒక షో లో కంటెస్టెంట్ గా చేస్తున్న సమయంలో ఆ షో కు జడ్జ్ గా వ్యవహరిస్తున్న వారి పట్ల గౌరవంగా ఉండాలని వనిత విజయ్ కుమార్ ఆ విషయంను గుర్తించాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.