Begin typing your search above and press return to search.

బ‌డేమియాతో మాజీ ప్ర‌పంచ సుంద‌రి రొమాన్స్!

By:  Tupaki Desk   |   28 Nov 2022 5:30 AM GMT
బ‌డేమియాతో మాజీ ప్ర‌పంచ సుంద‌రి రొమాన్స్!
X
అక్ష‌య్ కుమార్...టైగ‌ర్ ష్రాఫ్ క‌థానాయ‌కులుగా అబ్బాస్ జ‌ఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'బ‌డేమియా ఛోటేమియా' తెర‌కెక్క‌తున్న‌సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ రీసెంట్ క‌మిట్ మెంట్ ఇది. ఇందులో టైగ‌ర్ కి జోడీగా అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీక‌పూర్ ని ఎంపిక చేసారు. అయితే అక్ష‌య్ పాత్ర‌కు తొలుత హీరోయిన్ అవ‌స‌రం లేద‌నుకున్నారు.

దీంతో అక్ష‌య్ ని సోలోగా తెర‌పై చూపించాల‌నుకున్నారు. కానీ ఇప్పుడ‌దే క‌థ‌లో కొన్ని ర‌కాల మార్పులు చేయ‌డంతో ఆ పాత్ర‌కు హీరోయిన్ త‌ప్ప‌నిస‌రి అయింది. ఈ నేప‌థ్యంలో అక్ష‌య్ కి జోడీగా మాజీ ప్ర‌పంచ సుంద‌రి మానుషీ చిల్ల‌ర్ ని ఎంపిక చేసారు. మానుషీ ఎంపిక వెనుక చాలా పెద్ద క‌థే సాగింద‌ని తెలుస్తోంది. తొలుత అక్ష‌య్ కి హీరోయిన్ గా ఓస్టార్ హీరోయిన్ ని తీసుకోవాల నుకున్నారుట‌.

కానీ ఆ స్థాయి హీరోయిన్ క‌న్నా కొత్త నాయిక అయితే మ‌రింత ఉత్తమ‌గా ఉంటుంద‌ని భావించి చివ‌రిగా మానుషీని ఎంపిక చేసిన‌ట్లు చిత్ర‌ వ‌ర్గాలు గుర్తు చేసాయి. ఈ రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. షూటంగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసి డిసెంబర్ 15న చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమా షూటింగ్ ని ప్ర‌త్యేకంగా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇండియాలో ఏక ధాటిగా100 రోజుల పాటు షూట్ చేయ‌నున్నారు. అలాగే అవ‌స‌ర‌మైన‌ పాట‌ల షూట్ కూడా నిర్వ‌హిస్తారుట‌. అటుపై విదేశీ షెడ్యూల్స్ పూర్తి చేయ‌నున్నారు. ఐరాపో..యూఏయి ల‌లో షూటింగ్ చేయ‌నున్నారు.

ఇక అక్ష‌య్ కుమార్ బిజీ షెడ్యూల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఏడాదంతా సినిమా షూటింగ్ ల‌తో బిజీగానే ఉంటారు. బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా క్షిలాడీ అంత వేగంగా సినిమాలు చేయ‌లేరు. ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాలేరు. ఇది కేవ‌లం అక్ష‌య్ కి మాత్ర‌మే చెల్లింది. ఓవైపు ఆన్ సెట్స్ లో ఉంటూనే కొత్త సినిమాల‌కి సైన్ చేసి తెర‌పైకి తెస్తుంటారు.

కోవిడ్ స‌మ‌యంలో హీరోలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైతే అక్ష‌య్ మాత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. త‌న సినిమాల్ని థియేట‌ర్..ఓటీటీ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఇత‌ర భాష‌ల్లో వ‌చ్చిన అవ‌కాశాల్ని సైతం స‌ద్వినియోగం చేసుకుంటారు. భాషా బేధం లేకుండా సినిమాలు చేయ‌డం కూడా ఆయ‌న‌కే చెల్లింది. అక్ష‌య్ లో ఆ పాజిటివ్ యాంగిల్ అంద‌రికీ న‌చ్చేదిగా చెబుతుటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.