అందాలకు కంచె వేయడం మర్చిపోయినట్లుంది..!

Mon May 25 2020 15:20:10 GMT+0530 (IST)

Forgotten the fence of beauty

ప్రగ్యా జైస్వాల్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని అందమైన ముద్దుగుమ్మలలో ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తూ వస్తున్న ప్రగ్యా 2014లో విడుదలైన 'డేగ' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇక  అదే సంవత్సరం 'టిటు ఎంబిఏ' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా అమ్మడి అందాల ఆరబోతే ప్రేక్షకులకు దగ్గరవడానికి మేజర్ కారణం అని చెప్పాలి. అప్పటి నుండి ప్రగ్యా ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో తెలుగులో రెచ్చిపోతూ తన అందాలను దారపోసింది. ప్రగ్యా అందాలు చూసి వెర్రెక్కిపోయే వీరాభిమానులు లక్షల్లో ఉన్నారు. అలా కంచె సినిమా తర్వాత మనోజ్ తో గుంటూరోడు సాయిధరమ్ తేజ్ తో నక్షత్రం సినిమాలలో ఏకంగా కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది.నక్షత్రంలో అయితే ప్రగ్యా అందాలు నభూతో నభవిష్యత్ అనాలి. ఇక 2018లో విష్ణు హీరోగా వచ్చిన ఆచారి అమెరికా యాత్ర సినిమా తర్వాత ప్రగ్యా మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంది. రీసెంట్ గా ప్రగ్యా చేసిన ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్లకు మతిపోతుంది అనడంలో సందేహం లేదు. బ్లాక్ బికినీ టైప్ డ్రెస్ లో సముద్ర తీరాన అమ్మడి పోజులు చూస్తే ఎంతటి వారిలో అయినా వేడి పుట్టక తప్పదు. తన ఎక్సప్రెషన్స్ తో శరీర సౌందర్యంతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది సుందరి. చెక్కిన శిల్పంలా కనిపిస్తున్న ప్రగ్యా.. అలా తీరాన నిలబడి పోజిస్తే.. నెమలి పించం పురివిప్పినట్లుగా ప్రగ్యా సోయగాలు బయటపడుతున్నాయి. ప్రగ్యా అందాలు చూస్తున్న అభిమానులు కళ్లు పక్కకు తిప్పుకోలేక పోతున్నారంటే నమ్మక తప్పదు. సినిమాలకు కంచె వేసుకున్న ప్రగ్యా అందాలకు కంచె వేసుకోవడం మర్చిపోయినట్లుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.