Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోలకు ఆ హీరోయిన్‌ అంటే భయం..!

By:  Tupaki Desk   |   16 May 2022 2:30 PM GMT
స్టార్‌ హీరోలకు ఆ హీరోయిన్‌ అంటే భయం..!
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ధాకడ్ సినిమా తో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండు మూడు వారాలుగా సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేస్తూ సినిమాకు సంబంధించిన విషయాలను మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయిన కంగనా రనౌత్‌ మరోసారి బాలీవుడ్ హీరోలను టార్గెట్‌ చేసింది.

బాలీవుడ్‌ తో పాటు అన్ని వుడ్స్ లో ఒక హీరో సినిమాను మరో హీరో ప్రమోట్‌ చేయడం లేదంటే.. ఒక హీరోయిన్‌ సినిమాను మరో హీరోయిన్‌ ప్రమోట్‌ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కాకున్నా ఏదో ఒక సందర్బంలో ఇరత హీరోలు హీరోయిన్‌ లు మరో హీరో లేదా హీరోయిన్‌ సినిమాను ప్రమోట్‌ చేయడం ద్వారా తమ మద్య ఉన్న స్నేహం ను చూపిస్తూ ఉంటారు.

కంగనా మాత్రం ఈ విషయంలో తనకు ఏ ఒక్క స్టార్‌ ప్రమోషన్ లో హెల్ప్‌ అవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు చాలా మంది నా సినిమాలను ప్రమోట్ చేసేందుకు భయపడుతారు. నాకు వారి కంటే ఎక్కువ క్రేజ్.. గుర్తింపు వస్తుందేమో అనే భయంతో చాలా మంది నా సినిమాలను తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అంటూ కంగనా సంచలన ఆరోపణలు చేసింది.

హీరోయిన్‌ గా కంగనా ఈ మద్య కాలంలో కేవలం లేడీ ఓరియంటెడ్‌ సినిమాలనే చేస్తోంది. సీనియర్ స్టార్‌ హీరోలు.. యంగ్ స్టార్‌ హీరోలు ఎవరు కూడా ఈమెతో సినిమాలు చేయాలనే ఆసక్తితో కాని.. ఆలోచనతో కాని లేరు. వారు చేయాలని కూడా అనుకోరు. కంగనా కూడా స్టార్‌ హీరోలతో సినిమా చేయడం కష్టం అనే పరిస్థితి ఇండస్ట్రీలో ఏర్పడింది అంటూ మీడియా వర్గాల వారి అభిప్రాయం.

కంగనా ఎప్పటికప్పుడు బాలీవుడ్‌ స్టార్స్ పై మరియు స్టార్‌ హీరోయిన్స్ పై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ మద్య అమితాబచ్చన్‌ ధాకడ్‌ సినిమా యొక్క ప్రమోషన్‌ లో భాగంగా సాంగ్ ప్రోమోను ట్వీట్‌ చేశాడు. కారణం ఏంటో కాని ఆ ట్వీట్ ను అమితాబచ్చన్‌ డిలీట్‌ చేశాడు.

ఆ విషయమై కంగనా ఎంతటి రచ్చ చేసిందో తెల్సిందే. మొత్తానికి కంగనా తన సినిమా ప్రమోషన్ సమయంలో బాలీవుడ్‌ వర్గాల వారిని టార్గెట్‌ చేయడం చాలా కామన్ విషయం గా మారింది.