స్టార్ హీరో అభిమానుల కోసం...!

Thu Jun 10 2021 20:00:01 GMT+0530 (IST)

For Star? Hero fans ...!

తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. గతంలో పలు సందర్బాల్లో సాయం అవసరం అయిన వారికి మద్దతుగా నిలిచిన సూర్య తాజాగా మరోసారి తన మనసు చాటుకున్నాడు. తన అభిమాన సంఘంకు చెందిన 250 మందికి ఆర్థిక సాయం చేశాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి ఒకొక్కరి బ్యాంక్ అకౌంట్ లో నేరుగా రూ.5000 లను వేయించాడు. మొత్తంగా ఆయన రూ.12.5 లక్షల సాయంను చేయడం జరిగింది. అభిమానులను ఈ సమయంలో ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ పని చేశారట.గతంలోనే అభిమానులకు తనవంతు సహకారం అందిస్తూ నిత్యావసరాలను సరఫరా చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఉన్న వారికి కూడా తనవంతు సహాయంను చేసిన సూర్య ఈసారి ఏకంగా రూ.5 వేల రూపాయలను నగదు రూపంలో ఇచ్చి అభిమానులకు ఆర్థిక బాసట కల్పించాడు. సూర్య మంచి మనసును ఎంత పొగిడినా తక్కువే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సూర్య కొత్త సినిమా ఏర్పాట్లలో ఉన్నాడు. కరోనా కారణంగా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.

కరోనా కారణంగా గత ఏడాది సూరారై పోట్రూ సినిమా ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో మంచి టాక్ ను మరియు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. వరుసగా సినిమాలు చేస్తున్న సూర్య ప్రస్తుతం కొత్త సినిమా కొత్త సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.