12 ఏళ్లుగా దండయాత్ర ఫలించనే లేదు

Mon Jun 14 2021 15:00:01 GMT+0530 (IST)

For 12 years the invasion was in vain

దక్షిణాదిన ఎందరు స్టార్లతో నటించినా రాని క్రేజు .. పవన్ కల్యాణ్ `తీన్ మార్` చిత్రంతో కృతి కర్భందకు దక్కింది. ఆ తర్వాత వరుసగా చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకుంది. కానీ ఎందుకనో టాలీవుడ్ లో ఆశించిన రేంజుకు చేరుకోలేకపోయింది. ఆ తర్వాత కృతి బాలీవుడ్ లో ప్రయత్నించింది. కానీ అక్కడా కెరీర్ ఆశించినంత రేంజుకు చేరలేదు. పంజాబీ- తమిళం- కన్నడ-మలయాళంలోనూ నటించింది.ఇక తాను మధ్యతరగతి అమ్మాయిని అని తాను సాధించింది ఊహించలేనిది అని కూడా కృతి తాజా చాటింగ్ లో వెల్లడించింది. ఇప్పటికి 12ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ ఇకపైనా స్టార్ గా వెలగాలని ఆశిస్తోందట. బాలీవుడ్ లో పుల్కిత్ సామ్రాట్ కృతికి క్లోజ్. అతడు తన 12ఏళ్ల కెరీర్ సెలబ్రేషన్స్ ని విష్ చేశారు. ఇక కన్నడ నటుడు రక్షిత్ తాజా చిత్రం చార్లీ టీజర్ పై కృతి ట్విట్టర్లో ప్రశంసలు కురిపించింది. కన్నడ రంగంలో ఇకపైనా తాను రాణించాలనుకుంటోందట.

అయితే 12 ఏళ్లుగా పాపం దండయాత్ర చేస్తూనే ఉంది. కానీ కృతి కర్బందాకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు..! ఫ్యూచర్ లో అయినా వస్తుందో లేదో చూడాలి.. అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. మరి తీన్ మార్ బ్యూటీకి తిరిగి ఛాన్సిస్తారా లేదా చూడాలి.  హౌస్ ఫుల్ 4 .. పాగల్ పంటి చిత్రాల్లో కృతి నటించింది. 2020లో థైష్ అనే చిత్రానికి సంతకం చేసింది. దుల్కార్ సరసన వాన్ అనే రోడ్ ట్రిప్ మూవీలో నటిస్తోంది. జీస్టూడియోస్ 14 పెరే అనే కామెడీ డ్రామాలోనూ నటిస్తోంది. కృతి కర్భంద ప్రస్తుతం ఇన్ స్టాలో ఫోటోలు వీడియోలతో ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది.