Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం సల్మాన్ ఖాన్ లిప్ లాక్.. ట్విస్ట్ ఏంటంటే??

By:  Tupaki Desk   |   23 April 2021 3:30 AM GMT
ఫస్ట్ టైం సల్మాన్ ఖాన్ లిప్ లాక్.. ట్విస్ట్ ఏంటంటే??
X
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు. కానీ ఎప్పుడు కూడా తన సినిమాలలో లిప్ లాక్స్ అనేవి అవాయిడ్ చేస్తూ వచ్చాడు. ఆ మధ్య హీరో సినిమా వేడుకలో కూడా కిస్సింగ్ సీన్స్ అంటే నచ్చదు అని కూడా చెప్పేసాడు సల్మాన్ భాయ్. ప్రస్తుతం 55ఏళ్ల వయసులో తన 'నో కిస్' పాలసీని బ్రేక్ చేసినట్లే అనిపిస్తుంది. ఏకంగా ఈసారి 23ఏళ్ల కుర్రభామకు లిప్ లాక్ ఇచ్చేసినట్లు తెలుస్తుంది. సల్మాన్ భాయ్ లేటెస్ట్ మూవీ 'రాధే'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అయితే రాధే ట్రైలర్ లో సల్మాన్ భాయ్ హీరోయిన్ దిశాపటానికి లిప్ లాక్ చేస్తూ కనిపించడం ఫ్యాన్స్ కు షాక్ కలిగిస్తుంది.

ట్రైలర్ ను కాస్త దృష్టి పెట్టి గమనిస్తే ఆ లిప్ లాక్ సీన్ దొరుకుతుంది. ఫుల్ లెన్త్ పోలీస్ యాక్షన్ సినిమా కాబట్టి ట్రైలర్ లో జస్ట్ వన్ సెకండ్ మాత్రమే ఆ సీన్ ఉన్నట్లు కనిపించింది మరి సినిమాలో.. అయితే లిప్ లాక్ టైంలో దిశా లిప్స్ కు టేప్ అంటించి ఉండటం ట్విస్టు. ఏదేమైనా సల్మాన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సీన్ చూసి షాక్ అవుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఫ్యాన్స్ కూడా సల్మాన్ - దిశా కిస్సింగ్ సీన్ బాగుందని కామెంట్స్ పెట్టడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మరో ట్విస్ట్.. సీటిమార్ సాంగ్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన అదే ట్యూన్ చేంజ్ చేయకుండా లిరిక్స్ మాత్రమే చేంజ్ చేసినట్లు టాక్. మరి మొత్తానికి సల్మాన్ భాయ్ - ప్రభుదేవా ఈసారి చాలా ట్విస్టులతో రాబోతున్నారు. చూడాలి మరి మే 13న రాధే విజయవంతంగా రిలీజ్ అవుతుందేమో!