Begin typing your search above and press return to search.

మాస్ లుక్ తో అదర గొట్టేసిన వెంకీ

By:  Tupaki Desk   |   22 Jan 2020 4:02 AM GMT
మాస్ లుక్ తో అదర గొట్టేసిన వెంకీ
X
క్రేజీ సినిమాల కుండే క్రేజే వేరు. ఒక భాషలో సూపర్ హిట్ అయిన మూవీని.. మరో భాషలో రీమేక్ చేస్తున్నారన్నంతనే ఆ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగి పోతాయి. భాషకు.. నేటివిటికి అనుగుణంగా చిన్న చిన్నమార్పులు చేయాల్సిన విధంగా చేస్తే.. ప్రెష్ లుక్ తో పాటు.. ట్రీట్ మెంట్ కు అదిరిపోయే రెప్పాన్స్ ఉంటుంది. అలాంటి సాహసాలు చేయటం మనకెందుకులే.. బుద్దిగా ఉన్నది ఉన్నట్లుగా తీసేద్దామన్న సేఫ్ గేమ్ ప్లాన్ చేసినా.. మినిమం హిట్ కు ఢోకా ఉండదు.
అందుకే చాలా వరకూ రేమేక్ లతో పెద్ద సమస్య ఉండదు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసుసరన్ మూవీని తెలుగులో వెంకటేశ్ కథా నాయుకిడిగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు.. కలైపులి యస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రపు ఫస్ట్ లుక్.. టైటిల్ ను మంగళవారం అర్థరాత్రి.. సరిగ్గా పన్నెండు గంటలకు (అంటే.. బుధవారంలోకి అడుగు పెట్టినంతనే విడుదల చేశారు.

ఈ సినిమాకు సంబంధించి రెండు భిన్నమైన అంశాలేమంటే.. సాఫ్ట్ సినిమాలు చేయటంలో మంచి పేరున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పూర్తి మాస్ సినిమా చేయటం.. ఇటీవల కాలంలో వెంకీ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండటం. ఫస్ట్ లుక్ పేరుతో మూడు పోస్టర్లను రిలీజ్ చేసి.. సినిమా మీద అందరూ చర్చించుకునేలా చేయటంలో శ్రీకాంత్ అడ్డాల సక్సెస్ అయ్యారు. రఫ్ లుక్ తో భయపెట్టేలా వెంకీ ఉన్నాడు. ఆగ్రహం.. ఆవేశాన్ని కలగలిపి కత్తి పట్టుకొని వస్తున్న లుక్ ఒకటైతే.. రక్తం పట్టిన కత్తి ఆగ్రహంతో ఊగిపోతున్న ముఖానికి దగ్గరగా ఉన్న లుక్ మరకొటి.. ఆకాశం లోకి దీనంగా చూస్తున్న మరో లుక్ తో కనిపించాడు వెంకీ.

నారప్ప టైటిల్ ఫిక్స్ చేయటం తో పాటు.. ఫుల్ మాస్ లుక్ తో ఉన్న ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. గడిచిన కొన్నేళ్లుగా.. వెంకీ సాఫ్ట్ గా కనిపించటమే తప్పించి.. ఈ తరహాలో మాస్.. యాక్షన్ రఫ్ లుక్ తో కనిపించింది లేదు. చూసినంతనే సరికొత్తగా అనిపిస్తున్న ఫస్ట్ లుక్ ఈ సినిమా మీద అంచనాల్ని పెంచుతుందని చెప్పకతప్పదు. ప్రియమణి కథానాయికిగా నటిస్తారని భావిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అనంతపురంలో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. నెలాఖరు లో తొలి షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారని.. చిత్రం లో తన క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ మీద వెంకీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా చెబుతున్నారు.