18 ఏళ్లకే తొలి అనుభవం...బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

Mon May 03 2021 15:00:01 GMT+0530 (IST)

First experience at the age of 18 ... Bollywood star heroine Bold Comments

సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో నటిస్తున్న హీరోయిన్లకు బాలీవుడ్ హీరోయిన్లకు చాలా తేడా ఉంటుంది. సహజంగా సినిమా హీరోయిన్ల పై అఫైర్లకు సంబంధించిన వార్తలు తరచూ వస్తూ   హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి. ఏదో ఒక హీరోయిన్ హీరో కు మధ్య అఫైర్ నడుస్తోందంటూ నిత్యం గాసిప్ లు వస్తూనే ఉంటాయి. దక్షిణాదిలో ఇటువంటి రూమర్లు వస్తే హీరోయిన్లు తెగ ఫీల్ అయిపోతుంటారు. అవేవీ నిజం కాదని ఖండిస్తుంటారు.కానీ బాలీవుడ్ లో అలా  కాదు. బాలీవుడ్ హీరోయిన్లు ఇలాంటి విషయాలను కాస్త తేలిగ్గానే తీసుకుంటారు. హీరోలతో లవ్ అఫైర్స్  నడపడం అక్కడి హీరోయిన్లకు మామూలే. సెక్స్ కు సంబంధించిన విషయాలను కూడా వారు ఓపెన్ గా మాట్లాడుతుంటారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అయితే పర్సనల్ లైఫ్ లవ్ అఫైర్స్ గురించి మాట్లాడుకునేందుకే స్పెషల్ గా 'కాఫీ విత్ కరణ్ షో' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే హీరోలు హీరోయిన్లు సినీ   రంగంలో పనిచేసే ప్రముఖులు  సెక్స్ సంబంధించి లవ్ అఫైర్స్ గురించి  తమ తొలి అనుభవాలను వెల్లడిస్తుంటారు.

ఆ మధ్య క్రికెటర్లు పాండ్యా రాహుల్ కూడా ఈ షో  లో పాల్గొని బోల్డ్ కామెంట్స్ చేశారు. తాము ఇంతవరకు ఎంతమందితో సెక్స్ జరిపామో చెప్పి విమర్శల పాలైన  సంగతి తెలిసిందే.తాజాగా తన తొలి అనుభవంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఓపెన్ గా మాట్లాడింది. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన పర్సనల్ విషయాలను ఈ భామ వివరించింది.

తన తొలి అనుభవం ముద్దు గురించి పరిణీతి చోప్రా ఏమాత్రం దాచుకోకుండా ఓపెన్ గా చెప్పేసింది. తాను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక కుర్రాడిని ముద్దుపెట్టుకున్నానని పరిణీతి చోప్రా చెప్పింది. ముద్దే నా  ఎవరితోనూ తొలి డేట్ కు వెళ్లలేదా.. అని మీడియా అడుగగా.. ఇంతవరకు తాను ఎవరితోనూ డేట్ కి వెళ్లలేదని లేదని పరిణీతి చోప్రా చెప్పింది. తన తొలి ముద్దు అనుభవంపై  పరిణీతి చోప్రా చేసిన  కామెంట్స్  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.