ఫస్ట్ లుక్ : శర్వా 'శ్రీకారం' అదిరింది

Mon Jan 27 2020 13:06:04 GMT+0530 (IST)

First Look: Sharwanand slips into Lungi for 'Sreekaram'

విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుంటూ కెరీర్ ఆరంభం నుండి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను దక్కించుకుని మినిమం గ్యారెంటీ హీరోగా పేరు దక్కించుకున్న శర్వానంద్ త్వరలో 'జాను' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సెన్షేషనల్ సక్సెస్ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు. అక్కడ విజయ్ సేతుపతి చేసిన పాత్రను ఇక్కడ శర్వానంద్ చేసిన విషయం తెల్సిందే. జాను విడుదలకు సిద్దం అవుతున్న సమయంలోనే శ్రీకారంను ప్రకటించాడు.నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీకారం' ఫస్ట్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ పొందుతుంది. శర్వానంద్ ఒక పల్లెటూరి కుర్రాడి మాదిరిగా లుంగీ కట్టుకుని బుజాన టవల్ వేసుకుని పొలం గట్టున నడుస్తున్న ఈ ఫస్ట్ లుక్ కు ఫిదా అవ్వని వారు అంటూ ఎవరు లేరు. చాలా కలర్ ఫుల్ గా ఉండటంతో పాటు ఫస్ట్ లుక్ చూస్తుంటేనే సినిమాను చూడాలన్నంత ఆసక్తి కలుగుతుందంటూ శర్వా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట మరియు గోపీ ఆచంటలు కిషోర్ బి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ విడుదలతో పాటు సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. షూటింగ్ చకచక పూర్తి చేసి మే లేదా జూన్ ఆరంభంలో విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. జాను తర్వాత కొద్ది గ్యాప్ లోనే శ్రీకారం తో శర్వా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.