ఫస్ట్ గ్లింప్స్: ఇది నిజంగా పండగే.. డౌట్ లేదు

Tue Oct 15 2019 17:45:23 GMT+0530 (IST)

మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'.  తేజు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఒక ఫీల్ గుడ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురు చూసినవారిని సంతోషపెట్టేలానే ఉంది ఈ పండగ శాంపిల్.ప్రతిరోజూ పండగే..  టైటిల్ లోనే ఒక సెలబ్రేషన్ ఉంది.  అలానే ప్రతి ఫ్రేం లో ఒక లైవ్లీ నెస్.. ఒక హ్యాపీనెస్ కనిపించేలా విజువల్స్ ఉన్నాయి.  పచ్చని పొలాల మధ్య బైకుపై తాతయ్యను కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ తీసుకుపోతున్న మనవడు తేజు..  మరో సీన్ లో తేజు కూల్ గా కాఫీ తాగుతూ ఉంటే ఉక్రోషంతో చూస్తూ వేలిని కొరుకుతూ ఉండే బ్యూటిఫుల్ రాశి.. ఇంకో సీన్ లో రావు రమేష్.. తేజు ఇద్దరూ ఫారెన్ లొకేషన్ లో సూటు బూట్లలో తుళ్ళిపడుతూ ఉండే సీన్.. వానపడుతూ ఉంటే సగం తడుస్తూ ఆటో వెనక కూర్చుని తాతయ్యతో కలిసి నవ్వుతూ పుచ్చకాయ తింటూ ఉండడం.. ఇలా ప్రతి ఫ్రేం ఒక ప్రాణమున్న పెయింటింగ్ లా కనిపిస్తోంది.  నట్టింట్లో తాతయ్య డ్యాన్స్ ను చూసి ఎంతో గ్రేస్ ఫుల్ గా నవ్వుతున్న తేజు దగ్గర ఆపేసి హ్యాపీ బర్త్ డే క్యాప్షన్ ఇవ్వడం అదిరింది. గ్లింప్స్ ఒక పర్ఫెక్ట్ ఫెస్టివల్ లాగా ఉంది.

ఇక థమన్ భయ్యా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆహ్లాదకరంగా ఉంది. పల్లెటూరి విజువల్స్ ను అంత అందంగా చూపించిన జయకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది.  ఓవరాల్ గా ఇది తేజునుంచి  సూపర్ బర్త్ డే ట్రీట్. ఆలస్యం ఎందుకు.. చూసేయండి.