Begin typing your search above and press return to search.

నరేష్ మీద యాక్షన్ ... ?

By:  Tupaki Desk   |   13 Oct 2021 1:30 PM GMT
నరేష్ మీద యాక్షన్ ... ?
X
మా లో విభేధాలు వీధిన పడ్డాయి. ఒకసారి సఖ్యత చెడ్డాక తిరిగి అతుక్కోవడం అంటే కష్టమే. అయితే మేమంతా ఒక ఫ్యామిలీ అని చెబుతున్నారు కాబట్టి కొన్ని విషయల్లో పెద్దలు రాజీ పడితే ఒక మెట్టు వెనక్కి తగ్గితే కొంత సాఫీగా మా వ్యవహారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మా సభ్యులు అంతా కూడా ఇపుడు ఒక్క విషయంలో మాత్రం గట్టిగా వేలెత్తి చూపిస్తున్నారు. మా కొత్త ప్రెసిడెంట్ విష్ణు మీద ఎవరూ పల్లెత్తు మాట అనడంలేదు. మంచు మోహన్ బాబుని నరేష్ ని టార్గెట్ చేస్తున్నారు. పేరుకు విష్ణు ఉన్నా మోహన్ బాబే అసలైన అధ్యక్షుడు అని కూడా అనుమానిస్తున్నారు. దాంతో పాటుగా నిన్నటిదాకా మా ప్రెసిడెంట్ గా ఉన్న నరేష్ మీద కూడా గుర్రుమంటున్నారు.

మా లో అంతా కలసి పనిచేయాలంటే ఈ ఇద్దరి విషయంలో కొన్ని ఉపశమనాలు ప్రకాష్ రాజ్ ప్యానల్ తో పాటు తెర వెనక ఉన్న పెద్దలకు కూడా కావాలి. అలా కనుక చూసుకుంటే మోహన్ బాబు మీద విష్ణు ఎటూ యాక్షన్ తీసుకోలేరు. అయితే ఆయన్ని పూర్తిగా తెర వెనక్కు వెళ్ళమని చెప్పి విష్ణు తానే ప్రెసిడెంట్ గా డ్యూటీస్ డిశ్చార్జి చేస్తానని ఓపెన్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఒక స్పష్టత వస్తే చాలు. అయితే నరేష్ విషయంలో మాత్రం మా సభ్యులు అంతా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అది మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజాతో మొదలుపెడితే పోటీ చేసి ఓడిన ప్రకాష్ రాజ్, నటుడు శ్రీకాంత్ ల దాకా అంతా నరేష్ ని టార్గెట్ చేస్తున్నారు.

నరేష్ హయాంలో జరిగిన ఆర్ధిక లావాదేవీలలో లెక్కలు తేల్చాలని శివాజీరాజా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. దాంతో వాటి మీద విష్ణు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ముందు అర్జంటుగా నరేష్ ని సైడ్ చేస్తే కొంత ఊరట వస్తుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ మెంబర్స్ కూడా కోరుకునేది అదే. అయితే విష్ణు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా ఆయన వెనక నరేష్ ఉన్నారు. తాను విష్ణుతోనే ఉంటానని కూడా గట్టిగా చెబుతున్నారు. ఇక నరేష్ అంటే ఒక వ్యక్తి కాదు, వెనక ఘట్టమనేని ఫ్యామిలీ ఉంది. వారితో మోహన్ బాబు ఫ్యామిలీకి రిలేషన్స్ బాగా ఉన్నాయి. అన్నింటి కంటే ముందు విష్ణు గెలుపు వెనక నరేష్ కూడా ఉన్నారు. ఈ సమయంలో ఆయన మీద యాక్షన్ తీసుకోవడం అయ్యే పనేనా అన్నదే చర్చ. అది కనుక జరగకపోతే మాలో ఈ చీలిక అలాగే కొనసాగుతుంది. అయితే విష్ణు తన పనితీరుతో మెంబర్స్ ని మచ్చిక చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి యాక్షన్ సీన్లు అవసరం లేదు. మొత్తానికి విష్ణు వైపే అందరి కళ్ళూ ఉన్నాయి. ఆయన మాత్రం దూకుడుగా వెళ్తే తెర ముందున్న వారు, తెర వెనక ఉన్న పెద్దలు కూడా కొంత షాక్ తినడం ఖాయమే అని చెప్పాలి.