ఫైనల్ గా ప్రభాస్ వీడియో షేర్ చేశాడు!

Sat Sep 24 2022 17:31:58 GMT+0530 (India Standard Time)

Finally Prabhas shared the video

సీయర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు సెప్టెంబర్ 11న తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ దుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు మృతి పట్ల ఆయన అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హీరోగా నిర్మాతగా రాజకీయ వేత్తగా విలక్షణమైన వ్యక్తిత్వంతో తనదైన ముద్దర వేశారు. కృష్ణంరాజు అకాల మరణం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ని తీవ్ర శోకానికి గురిచేసింది.కృష్టంరాజుతో ప్రభాస్ కున్న అనుబంధం చాలా ప్రత్యేకం. ఆయన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ప్రభాస్ ప్రతి సినిమాలోనూ పెదనాన్ని కృష్ణంరాజు తనలో కనిపించేలా హీరోగా పవర్ ఫుల్ పాత్రలకు వెండితెరపై తనదైన మార్కు నటనతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్రభాస్ .. పెదనాన్ని కృష్ణంరాజు అకాల మరణంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే వెంటనే తేరుకున్న ప్రభాస్ ఇటీవల షూటింగ్ కి వెళ్లడం తెలిసిందే.

సెప్టెంబర్ 21న ప్రధాన కార్యక్రమాన్ని పూర్తి చేసిన ప్రభాస్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతకు ముందే ప్రత్యేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్త పేట మండలంలోని ప్రముఖ విగ్రహాల శిల్పి వడయార్ కి  కృష్ణంరాజు మైనపు విగ్రహాన్ని తాయరు చేసే పనిని అప్పగించారు. విగ్రహాన్ని 21న హైదరాబాద్ కు తీసుకురావడం.. అదే రోజు ప్రధాన కార్యక్రమం వుండటంతో విగ్రహాన్ని తెప్పించి ప్రత్యేకంగా పూలమాలతో అలంకరించారు.

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు విగ్రమానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కృష్ణంరాజు చనిపోయిన దగ్గరి నుంచి షూటింగ్ లకు సోషల్ మీడియాకు దూరంగా వుంటూ వచ్చిన ప్రభాస్ ఫైనల్ గా శనివారం పెదనాన్ని కృష్ణంరాజు తనని కంపేర్ చేస్తూ ప్యాన్స్ రూపొందించిన ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా వుంటే ప్రభాస్ గురువారం నుంచి షూటింగ్ లలో పాల్గొంటున్నారు.

`సలార్` కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన 12 సెట్ లలో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ లోకి ప్రభాస్ అడుగుపెట్టి చిత్ర బృందాన్ని సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.