Begin typing your search above and press return to search.

విరాళాలతో సినిమా.. హీరో ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   25 May 2020 7:50 AM GMT
విరాళాలతో సినిమా.. హీరో ఎవరో తెలుసా?
X
లాక్ డౌన్ సమయంలో సినీ ఇండస్టీ భారీ నష్టాలను చవిచూసింది. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి.. సినీ ఇండస్ట్రీని తిరిగి నిలబెట్టడానికి కోలివుడ్ పరిశ్రమ సిద్ధమైంది. ఈ మేరకు కోలీవుడ్ నిర్మాతలు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బీ చౌదరి , పిరమిడ్ నటరాజన్, ప్రముక ఎగ్జి బిటర్ తిరుపూర్ సుబ్రమణియన్ లు చేతులు కలిపారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఆసక్తిగల వారి నుంచి విరాళాలు పోగు చేశారు. వారు తలోచేయి వేశారు. అలా పోగు చేసిన రూ.2 కోట్లతో సినిమా తీయడానికి సంకల్పించారు.

ఇలా విరాళాలతో తీసే సినిమా వల్ల ఎవరికి ఎలాంటి నష్టం రాదు.. లాభాలు వస్తే మాత్రం అందరికీ పంచుతారు. సినిమా ఇండస్ట్రీని నిలబెట్టడమే లక్ష్యంగా అందరూ కలిసి ఈ ప్లాన్ చేశారు.

కోలివుడ్ సినీ పెద్దల నుంచి విరాళాల ద్వారా దాదాపు రూ.2 కోట్లను వసూలు చేశారు. ఈ 2 కోట్లతోనే 30 రోజుల్లోనే సినిమా తీయడానికి సీనియర్ తమిళ దర్శకుడు కే.ఎస్. రవికుమార్ తో నిర్మాతలు చేతులు కలిపారు.

ఈ సినిమాలో హీరోగా ప్రఖ్యాత విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు సత్యరాజ్, పార్థీపాన్ లు కీలక పాత్రలు పోషించనున్నాయి. ఇక ఈ సినిమాలో నటించే ఏ నటుడికి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వరు. సాంకేతిక నిపుణులు కూడా ఉచితంగా పనిచేయాలి. సినిమా ఆడి లాభాలు వచ్చాక అందరికీ పంచుతారు.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని కేవలం 30 రోజుల్లోనే తీయాలని సంకల్పించారు. సినిమా హాళ్ల ప్రారంభం తరువాత ఈ సినిమానే మొదట విడుదల చేయనున్నారు. ఆ తరువాత 100 రోజులకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు, టీవీల్లో కూడా ప్రదర్శించనున్నారు.

ఇలా కోలివుడ్ సినీ పరిశ్రమకు తిరిగి ఊపిరి లూదేందుకు ఇండస్ట్రీ అంతా విరాళాలు పోగు చేసి సినిమా తీస్తున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం ఇలా ఎవరికి నష్టం కలగని రీతిలో సినిమాలు తీస్తే పరిశ్రమ బాగుపడుతుంది. తిరిగి పూర్వ రూపం సంతరించుకుంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.