న్యూస్ కాస్టర్స్ తోనే క్రిటిక్స్ కి భరోసా

Tue Mar 26 2019 14:50:41 GMT+0530 (IST)

24/7  (వారం) అంతా సెలవు అన్నదే లేకుండా పని చేసే వృత్తి జర్నలిజం. ఫ్యామిలీ లైఫ్ ని త్యాగం చేసి సంస్థ కోసం రేయింబవళ్లు శ్రమించే సినీజర్నలిస్టుల స్థితిగతులను పరిశీలిస్తే .. ఈ సెక్షన్ జర్నలిస్టుల పరిస్థితి సురక్షితంగా ఉందా? అంటే ఇంతకాలం లేదనే మాటే వినిపించింది. జమానా కాలంలో ప్రారంభించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వీర్యం అయిపోవడంతో .. ఇప్పుడు `ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా` (ఎఫ్ ఎన్ ఏఈఎమ్) తెరపైకి వచ్చింది. అయితే ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ మీడియా - వెబ్ మీడియా జర్నలిస్టుల వరకూ పరిమితం. దాదాపు 150 మంది జర్నలిస్టుల్లో 100 మంది వరకూ పని చేసేది ఎలక్ట్రానిక్ - వెబ్ మీడియాల్లోనే కావడంతో ఇది అతిపెద్ద అసోసియేషన్ గా ఆవిర్భవించింది. ఇక ప్రింట్ మీడియా జర్నలిస్టులెవరూ ఈ సంఘంలో చేరకపోవడంపైనా ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.ఇకపోతే ఎఫ్ ఎన్ ఏఈఎమ్ ఇప్పటికే  సంస్థాగతంగా బలోపేతంగా మారింది. తాజాగా ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ డైరీని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ సారథ్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఐడీ కార్డులను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆవిష్కరించగా - టెర్మ్ పాలసీని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన నవీన్ ఎర్నేని.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఆ విష్కరించారు. యాక్సిడెంటల్ పాలసీని సాయిధరమ్ తేజ్ - మెడికల్ పాలసీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత - నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు.

సినీజర్నలిస్టుల్ని ఆదుకునేందుకు పరిశ్రమ ఎల్లపుడూ ముందుంటుందనడంలో సందేహం లేదు. అయితే ఒకప్పుడు గురువుగారు.. దివంగత డా.దాసరి నారాయణరావు సినిమా జర్నలిస్టుల్ని 25వ అసోసియేషన్ గా ప్రకటించినా ఆ తర్వాత క్రిటిక్స్ అసోసియేషన్ సుప్థావస్తలో ఉండడంతో ఈ రంగంలో పని చేసే యువజర్నలిస్టుల(5-10 ఏళ్ల అనుభవం ఉన్నవారు)కు సరైన దిక్కు లేకుండా పోయింది. దీనిపై ఫిలిం క్రిటిక్స్ అసోసియేన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ క్రమంలోనే ఎఫ్ ఎన్ ఏఈఎమ్ దూకుడుగా పని చేస్తూ వ్యవస్థాగతంగానూ ఎదుగుతోంది. ఈ సంఘంలోని సభ్యులందరికీ మినిమం భరోసా కల్పించే దిశగా చర్యలు చేపట్టడాన్ని సభ్యులంతా హర్షిస్తున్నారు. ఇక ఈ సంఘానికి పరిశ్రమ అగ్ర నిర్మాత పంపిణీదారుడు ఏకంగా రూ.18లక్షల సాయం చేశారంటే సినీజర్నలిస్టులకు ఏ స్థాయి గౌరవం దక్కిందో అర్థం చేసుకోవాలి.