Begin typing your search above and press return to search.

ప్ర‌తీ శుక్ర‌వారం ఒక‌రు వెలుగులోకి!

By:  Tupaki Desk   |   24 Jun 2022 2:30 AM GMT
ప్ర‌తీ శుక్ర‌వారం ఒక‌రు వెలుగులోకి!
X
సినిమా ఇండస్ర్టీలో శుక్ర‌వారం ప్ర‌త్యేక‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా రిలీజ్ కి శుక్ర‌వారం ఓ సెటిమెంట్..ఓ ఆచారంగా ఎప్ప‌టి నుంచో వ‌స్తోన్న రోజు. అగ్ర హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల వ‌ర‌కూ ప్ర‌తీ హీరో శుక్ర‌వారం రోజునే ప్రేక్ష కుల ముందుకు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఎంత పోటీ ఉన్నా శుక్ర‌వారం మాత్ర‌మే సినిమా రిలీజ్ జ‌ర‌గాల‌ని ఎప్పు డూ పోటీ ఉంటుంది.

శుక్ర‌వారం వచ్చిందంటే థియేట‌ర్లోకి ఏదో ఒక కొత్త సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. తెలుగు సినిమాకి ఎప్ప‌టి నుంచో ఓ సెంటిమెంట్ వ‌స్తోన్న విధానం ఇది. ధ‌న‌ల‌క్షి సిద్దిస్తుంద‌నో? లేక ఇంకేవైనా బ‌ల‌మైన కార‌ణాలు శుక్ర‌వారానికి ఉండొచ్చు. అవి ఎలా ఉన్నా ప్ర‌తీ శుక్ర‌వారం ఓ కొత్త న‌టుడు ప‌రిచయం అవుతాడు అన్న‌ది గ్ర‌హించాల్సిన విష‌యం.

ప‌రిశ్ర‌మ‌లో పోటీ తీవ్ర‌త‌ని శుక్ర‌వారం డిసైడ్ చేస్తుంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో న‌టుడు ప్రవీణ్ విశ్లేష‌ణ‌లో తెలుస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో పోటీ ఎక్కువ‌గానే ఉంది. ప్ర‌తీ శుక్ర‌వార ఓ హాస్య న‌టుడు వెలుగులోకి వ‌స్తున్నాడు అని అన్నారు. ''రిలీజ్ కి ముందు వ‌ర‌కూ ఇండ‌స్ర్టీలో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది స్ప‌ష్టంగా చెప్ప‌డం క‌ష్టం. ఓ న‌టుడు మ్యాక‌ప్ వేసుకుని తెర మీద క‌నిపించిన‌ప్పుడు..ఆ న‌టుడు మెప్పించిన‌ప్పుడు..స‌క్సెస్ అయిన‌ప్పుడు అస‌లైన పోటీ గురించి తెలుస్తుంది.

అలాంటి న‌టులు ప్ర‌తీ శుక్ర‌వారం వ‌స్తునే ఉన్నారు. ఎంతో మంది కొత్త వారు వ‌స్తున్నారు. స‌క్సెస్ అవుతున్నారు. త‌మ ఫ‌రిదిలో అవ‌కాశాలు అందుకుంటున్నారు. ఒక్కొక్క‌రిది ఒక్కో శైలి. 'జ‌బ‌ర్ ద‌స్త్' లో కొంత మంది టైమింగ్ చాలా బాగుంటుందని'' అన్నారు. అదే శుక్ర‌వారం న‌టుల‌తో పాటు ద‌ర్శ‌కులు..నిర్మాత‌లు కూడా వెలుగులోకి వ‌స్తున్నారు.

స‌క్సెస్ అయితే మ‌రో సినిమా చేస్తున్నారు. ప‌రిమిత బ‌డ్జెట్ లో స‌రైన కంటెంట్ తో తీస్తే సినిమాల‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ బాగుంటుంది. అయితే కోవిడ్ పాండ‌మిక్ కార‌ణంగా చిన్న సినిమాల నిర్మాణం బాగా త‌గ్గింది.

కోవిడ్ కి ముందు ప్రారంభ‌మైన కొన్ని సినిమాలు మ‌ధ్య‌లోనే నిలిచిపోయాయి. కొన్ని సెట్స్ లో ఉండ‌గా..మరికొన్ని ల్యాబ్ లోనే మిగిలిపోయాయి. అలాంటి చిత్రాల‌కు ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించాల‌ని విన‌తులు అందాయి. కానీ అవి కార్యాల‌యం..మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యాయి. ప్ర‌భుత్వం చొర‌వ చూపితే త‌ప్ప అవి రిలీజ్ అవ్వ‌డం క‌ష్టం అని తెలుస్తోంది.