Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ కు మెమోరీ లాస్ భ‌యం

By:  Tupaki Desk   |   6 July 2022 2:30 AM GMT
స్టార్ హీరోయిన్ కు మెమోరీ లాస్ భ‌యం
X
మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా గ‌త కొంత కాలంగా త‌న క్రేజ్ ని కోల్పోతోంది. మునుప‌టి స్థాయిలో స్టార్ హీరోల చిత్రాల్లో న‌టించే ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకోలేక‌పోతోంది. కెరీర్ ప‌రంగా కొత్త వాళ్లు రావ‌డంతో పోటీ కార‌ణంగా కాస్త వెన‌క‌బ‌డిన మిల్క్ బ్యూటీ ఇటీవ‌ల విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్ టై `ఎఫ్ 3`మూవీతో తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్ర‌స్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `భోళా శంక‌ర్‌`తో పాటు యంగ్ హీరో స‌త్య‌దేవ్ తో క‌లిసి `గుర్తుందా సీతాకాలం` మూవీలో న‌టిస్తోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డికి రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నా సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ తో #AskTamannah హ్యాష్ ట్యాగ్ తో ప్ర‌త్యేకంగా చిట్ చాట్ నిర్వ‌హించింది.

ఇందులో ప‌లువురు ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పింది. న‌చ్చిన ఐస్ క్రిమ్ ఏదంటే చాకోలేట్ ఐస్ క్రీమ్ అని, న‌చ్చిన హాలీడే ప్లేస్ ల‌లో న్యూ యార్క్ లేదా లండ‌న్ అని అడిగితే న్యూ యార్క్ అని స‌మాధానం చెప్పింది.

అయితే మీ బిగ్గెస్ట్ ఫియ‌ర్ ఏంట‌ని ఓ అభిమాని అడిగితే మెమోరీ లాస్ అంటూ షాకిచ్చింది. త‌మ‌న్నా చెప్పిన స‌మాధానం ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

అంతే కాకుండా `భోళా శంక‌ర్‌`లో మెగాస్టార్ చిరంజీవితో మీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ని ఎంత వ‌ర‌కు ఆశించ‌వ‌చ్చు అని ఓ అభిమాని అడిగితే మీరు డిజ‌ప్పాయింట్ అవ్వ‌ర‌ని స‌మాధానం చెప్పింది. అంటే చిరుతో క‌లిసి `భోళా శంక‌ర్‌`లో మిల్క్ బ్యూటీ స్టెప్పులు ఇర‌గ‌దీస్తుంద‌న్న‌మాట‌.

అంతే కాకుండా `ఎఫ్ 3`లో తాను పోషించిన అబ్బాయి పాత్ర గురించి అడిగితే..ఈ పాత్ర ద్వారా నాలోని రౌడీని బ‌య‌టికు తీశాన‌ని, ఈ పాత్ర‌లో న‌టించిన ప్ర‌తి బిట్ ని ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకొచ్చింది. త‌మ‌న్నా చెప్పిన స‌మాధానాలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. చాలా రోజుల త‌రువాత మిల్క్ బ్యూటీ అభిమానుల‌తో ప్ర‌త్యేకంగా #AskTamannah హ్యాష్ ట్యాగ్ తో నిర్వ‌హించిన చిట్ చాట్ కు బాఈ స్పంద‌న ల‌భించ‌డంతో త‌మ‌న్నా హ్యాపీగా ఫీలవుతోంద‌ట‌.