బోయపాటి మాటలు రిపీట్.. ఫ్యాన్స్ ఆందోళన

Sun Nov 28 2021 15:24:45 GMT+0530 (IST)

Fans worry About Akhanda Movie

లెజెండ్.. సరైనోడు వంటి భారీ మాస్ హిట్స్ తర్వాత బోయపాటి శ్రీను దర్వకత్వంలో చేసేందుకు రామ్ చరణ్ ఆసక్తి చూపించాడు. బోయపాటిని పూర్తిగా నమ్మిన రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాను చేశాడు. సినిమాలో మాస్ మరీ ఎక్కువ అయ్యింది.. యాక్షన్ కాస్త అతి అయ్యిందంటూ స్వయంగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసి సినిమాను ప్లాప్ చేశారు. వినయ విధేయ రామ ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్లుగా మెగా అభిమానులు అంటూ ఉంటారు. వారికి రక్త కన్నీరు మిగిల్చిన సినిమా వినయ విధేయ రామ. ఇప్పుడు మళ్లీ అదే మెగా అభిమానులు ఆసక్తిగా బోయపాటి వైపు చూస్తున్నారు. అల్లు అర్జున్ తో ఆయన తీయబోతున్న సినిమా గురించి అంతా ఆసక్తిని కనబర్చుతున్నారు.అల్లు అర్జున్ సినిమా కంటే ముందు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ సినిమాను భారీ ఎత్తున విడుదల ప్లాన్ చేశారు. తాజాగా ప్రీ రిలీజ్ వేడుక భారీ ఎత్తున జరిగింది. నందమూరి అభిమానుల ఉత్సాహం చూస్తుంటే అఖండ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి బాలయ్య మరియు బోయపాటిల కాంబోకు హ్యాట్రిక్ దక్కింది అన్నంత సంతోషంగా కనిపిస్తున్నారు. వారి ఆనందం కాస్త తగ్గేలా తాజాగా బోయపాటి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వినయ విధేయ రామ సినిమా విడుదలకు ముందు జరిగిన వేడుకలో బోయపాటి మాట్లాడుతూ మెగా ఫ్యాన్స్ గుండెల మీద చేయి వేసుకుని చూడండి.. అద్బుతంగా ఈ సినిమా వచ్చింది. చరణ్ కు ఈ సినిమా మరో రేంజ్ సక్సెస్ ను తెచ్చి పెడుతుంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూసిన తర్వాత గుండెలు జారి పోయాయి.. మెగా అభిమానులు గుండెల మీద చేయి వేసుకుని చివరకు గుండెలు జారుతుంటే పట్టుకున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బోయపాటి శ్రీను అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో ఆ మాటలు మాట్లాడటం జరిగింది. ఆ వీడియోలు కొందరు ట్రోల్ చేస్తున్నారు. అప్పటి వ్యాఖ్యలు ఇప్పటి వ్యాఖ్యలను పక్క పక్కన పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా కూడా వినయ విధేయ రామ సినిమా తరహా ఫలితాన్ని చవి చూడదు కదా అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అఖండ సినిమా పై ఫుల్ గా నమ్మకం ఉన్నా కూడా ఎక్కడ బోయపాటి గత సినిమా అనుభవం దృష్ట్యా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.