Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో సినిమా ప్రారంభోత్సవంకు ఫ్యాన్స్ హడావుడి

By:  Tupaki Desk   |   4 Dec 2021 12:30 AM GMT
స్టార్‌ హీరో సినిమా ప్రారంభోత్సవంకు ఫ్యాన్స్ హడావుడి
X
సౌత్‌ ఇండియన్ సినీ ప్రియులు తాము అభిమానించే హీరోల కోసం ఎంద దూరం అయినా వెళ్తారు.. ఎక్కడి వరకు అయినా వెళ్తారు. తమ అభిమాన హీరోల సినిమాలకు ప్లెక్సీలు కట్టడం.. కటౌట్ లకు పాలాభిషేకం.. పూలాభిషేకం చేయడం మనం చూస్తూనే ఉంటాం. సినిమాలు విడుదల సమయంలో ఈ హడావుడి అంతా మనం చూస్తాం. కాని మలయాళ స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరిగిన హడావుడి చర్చనీయాంశం అయ్యింది.

మరే హీరో సినిమా పూజా కార్యక్రమాల రోజు.. ఏ హీరో సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన రోజు కూడా అభిమానులు హడావుడి చేయడం చాలా తక్కువ. సోషల్‌ మీడియాలో హడావుడి ఉన్నా ఫిజికల్‌ మాత్రం హడావుడి కనిపించదు. కాని మమ్ముటీ అభిమానులు మాత్రం సోషల్‌ మీడియాతో పాటు థియేటర్ల వద్ద సందడి చేశారు.

కేరళలోని ఏకంగా 66 థియేటర్ల వద్ద మమ్ముట్టీ కొత్త సినిమా ప్రారంభః సందర్బంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసి భారీ ఎత్తున హడావుడి చేశారట. మమ్ముటీ అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు. ఆయన మలయాళ మెగాస్టార్ అనే పేరును దక్కించుకున్నాడు. అందుకే ఆయన సినిమాలు అంటేనే జనాలు చెవులు కోసుకుంటారు.

అక్కడి ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు కూడా మమ్ముటీ అంటే ప్రత్యేకమైన అభిమానం అనడంలో సందేహం లేదు. ఆయన నటించిన సినిమాలు తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. డైరెక్ట్‌ తెలుగు సినిమాను కూడా చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఇప్పుడు ఆయన సీబీఐ 5 అనే సినిమాను చేస్తున్నాడు.

సీబీఐ సినిమా లో హీరో కేసులు పరిష్కరించే తీరు.. తన తెలివితో అతి సులభంగా జనాల్లో ఉన్న క్రిమినల్స్ ను ఏరి పారేసే డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు నాలుగు పార్ట్‌ లుగా సీబీఐ సినిమా లు వచ్చాయి. ఇప్పుడు రాబోతున్న సినిమా ఐదవ పార్ట్‌. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నారు.

అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 66 థియేటర్ల వద్ద మమ్ముట్టీ అభిమానులు ప్లెక్సీలు ఏర్పాటు చేసి తెగ హడావుడి చేశారు. కేరళలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. మమ్ముట్టీ అభిమానులు చేసిన ఈ హడావుడి ముందు ముందు స్టార్‌ హీరోల అభిమానులకు ఇన్సిపిరేషన్ గా మారే అవకాశం ఉంది.