Begin typing your search above and press return to search.

మరో చారిత్రక సినిమాలో 'అక్షయ్'.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 3:30 PM GMT
మరో చారిత్రక సినిమాలో అక్షయ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!
X
బాలీవుడ్ స్టార్ హీరో.. ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్ మరో చారిత్రక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడ్ సౌత్’ అనే మూవీలో ఛత్రపతి శివాజీగా కనిపించబోతున్నాడు. ఈ మేరకు అక్షయ్ కుమార్ తన ట్విటర్లో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు.

ఈ మూవీలో ఛత్రపతి శివాజీ పాత్రను పోషించడం తన అదృష్టమని.. ఆయన జీవితం నుంచి పొందిన స్ఫూర్తితో.. అమ్మ ఆశ్వీరాదంతో ఈ సినిమా కోసం తన వంతు కృషి చేస్తానని అక్షయ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం అభిమానులంతా తనను ఆశీర్వదించాలని కోరాడు. అయితే ఈ ప్రకటన వచ్చిన వెంటనే అక్షయ్ కుమార్ ట్రోలర్స్ బారిన పడ్డారు.

అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘పృథ్వీరాజ్ చౌహన్’. భారత దేశం గర్వించ దిగిన నాటి రాజులలో పృథ్వీరాజ్ చౌహాన్ ఒకరు. భారతీయుల పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి అద్భుతమైన కథతో అక్షయ్ కుమార్ హీరోగా ‘పృథ్వీరాజ్ చౌహన్’ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు ఆశించినంత బజ్ మాత్రం రాలేదు.

కమర్షియల్ గానూ ‘పృథ్వీరాజ్ చౌహన్’ మూవీ హిట్ కాలేదు. అక్షయ్ కుమార్ వల్లే ఒక గొప్ప కథ మిస్ యూజ్ అయిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ మరోసారి చారిత్రక నేపథ్యం కలిగిన ఛత్రపతి శివాజీ పాత్రలో నటించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూవీలో అక్షయ్ కుమార్ నటించడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ పాత్ర కోసం మరొక హీరోను తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా పలు బాలీవుడ్.. టాలీవుడ్ సినిమాల్లో నటుడిగా చేసిన మంజ్రేకర్ తెరకెక్కిస్తుండటం విశేషం.

కాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే అక్షయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శివాజీ పాత్రలో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం అక్షయ్ కుమార్ కు ఏర్పడింది. ఈ ఏడాది అక్షయ్ ఇప్పటికే అరడజను సినిమాలకు పైగా విడుదల చేశారు. ఇంకా హేరా ఫెరి-3 లో నటిస్తున్నాడు. దీంతో అక్షయ్ కుమార్ ‘శివాజీ’ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందోననే ఆసక్తి నెలకొంది.