కత్రినాకు చేదు అనుభవం..!

Thu Jul 12 2018 16:41:33 GMT+0530 (IST)

Fans Misbehaving with Katrina Kaif in Vancouver

కత్రినా కైఫ్.. బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ప్రస్తుతం దబాంగ్ టూర్ లో భాగంగా అమెరికాలోని వాంకోవర్ లో ఉంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఆమె దురుసు ప్రవర్తన కారణంగా చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.  కార్యక్రమ వేదిక వద్దకు చేరుకునే క్రమంలో సెల్ఫీల కోసం అభిమానులు చుట్టుముట్టారు.  తమతో సెల్ఫీలు దిగాల్సిందిగా పలువురు కోరడంతో కత్రినా అవకాశం ఇచ్చింది. కాసేపటి తర్వాత ‘మీరిలా చేయకండి.. నేను అలసిపోయాను  అని తెలుసు కదా.. నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూ ’ కత్రినా కాస్త గట్టిగానే అభిమానులను మందలించారు.కత్రినా వ్యాఖ్యలకు బాధపడిన ఓ మహిళ.. ‘పెద్ద హీరోయిన్ అని చెప్పుకుంటారు కదా.. అభిమానులు ముచ్చటపడి దగ్గరికి వస్తే  అలా కసురుకుంటారా.. మీ ప్రవర్తన మార్చుకోండి.. ’ అంటూ కాస్తా ఘాటుగానే స్పందించింది. అయితే ఆ మహిళ మాటలకు కత్రినా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఆమెతో గొడవకు దిగింది. కత్రినా సెక్యూరిటీ సిబ్బంది కలుగజేసుకొని ఆమెను వారించారు. అయినప్పటికీ ఆ మహిళ ఊరుకోకుండా ‘మీకోసం ఎవరూ రాలేదు.. మేమంతా సల్మాన్ ఖాన్ కోసం వచ్చాం. కేవలం ఆయన కోసమే’ అంటూ కత్రినాకు ఎదురు తిరిగింది. ఇదంతా లైవ్ లో జరగడంతో కత్రినా పరువు పోయింది.