ఎన్టీఆర్ పై ప్రెజర్ పెంచుతున్న ఫ్యాన్స్..!

Tue Dec 06 2022 12:28:26 GMT+0530 (India Standard Time)

Fans Increasing Pressure On NTR..!

RRR తో వరల్డ్ వైడ్ షేక్ చేసిన హీరోల్లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఒకరు. ఆయన చేసిన కొమరం భీమ్ పాత్ర వరల్డ్ సినీ లవర్స్ కి బాగా నచ్చేసింది. ఇక సినిమాలో తారక్ చరణ్ చేసిన నాటు నాటు డ్యాన్స్ వీడియో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ట్రిపుల్ ఆర్ తో తారక్ చరణ్ ఇద్దరు సూపర్ పాపులర్ అయ్యారు. అయితే ఈ మూవీ పూర్తి కాగానే రాం చరణ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఆర్సీ 15 మూవీ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. అది పూర్తి కాకుండానే ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు చరణ్. రాం చరణ్ సినిమాల లైనప్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.అయితే ఎన్.టి.ఆర్ విషయంలో మాత్రం నందమూరి ఫ్యాన్స్ అప్ సెట్ అవుతున్నారు. ఎన్.టి.అర్ 30వ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చి చాలా నెలలు అవుతుంది. అయినా కూడా ఈ కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్లలేదు.

కొరటాల శివ ఆచార్య ఎఫెక్ట్ వల్ల అసలు బయట కనిపించడం మానేశాడు. ఎన్.టి.ఆర్ 30వ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఎనౌన్స్ చేశారు. కానీ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పుల వల్ల సినిమా లేట్ అవుతూ వస్తుంది. ఎన్.టి.ఆర్ కూడా కొరటాల శివకి తగినంత టైం తీసుకో అని చెప్పాడట. మిగతా హీరోలు వేగాన్ని పెంచగా ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ఎన్.టి.ఆర్ కి ప్రెజర్ ఎక్కువైందని తెలుస్తుంది.

కొరటాల సినిమా లేట్ అయ్యేట్టు ఉంటే మరో దర్శకుడితో అయినా సినిమా చేయాలని ఎన్.టి.ఆర్ ని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న విషయంపై ఎన్.టి.ఆర్ కూడా క్లారిటీగా లేడు అన్నట్టు తెలుస్తుంది.

కొరటాల శివ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా లైన్ లో ఉంది. అతనితో సినిమా మొదలు పెడదామని అనుకున్నా సలార్ పూర్తి కాలేదు కాబట్టి అది కుదరదు. అందుకే కొరటాల శివ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎన్.టి.ఆర్.

ఎంత వెయిట్ చేస్తే అంత బాగా వర్క్ అవుట్ చేసి సాలిడ్ సినిమా ఇస్తారని అనుకోవచ్చు. ఎన్.టి.ఆర్ మాత్రం కొరటాల శివ సినిమా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అసలేమాత్రం హడావిడి లేకుండా చూడాలని అంటున్నారట.

అలా హడావిడి చేస్తే సినిమా ఫలితంపై ఎఫెక్ట్ పడుతుందని తారక్ భావిస్తున్నారట. అందుకే కొరటాల శివకు అంత టైం ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.