Begin typing your search above and press return to search.

వీడియో: రజినీకాంత్ పోస్టర్ కు ఫ్యాన్స్ రక్తాభిషేకం

By:  Tupaki Desk   |   12 Sep 2021 1:33 PM GMT
వీడియో: రజినీకాంత్ పోస్టర్ కు ఫ్యాన్స్ రక్తాభిషేకం
X
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ఈ సినిమాలో నటిస్తున్నారు.

వినాయక చవితి సందర్బంగా ఈ చిత్రం పోస్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా వైరల్ అయ్యింది. మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఉదయం ఫస్ట్ లుక్ లో తెల్లషర్టు, పంచెకట్టుతో అందరినీ అలరించిన రజినీ.. ప్రస్తుత మోషన్ పోస్టర్ లో మాత్రం బైకుపై వస్తూ చేతిలో ఉన్నా కత్తితో మంటలు రాజేస్తున్నారు.

విభిన్నమైన యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంగా.. తమిళనాడులో కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. పోస్టర్ ను భారీ సైజులో కటౌట్ గా కట్టి దాని ముందు ఓ మేకపోతును బలిచ్చారు. కటౌట్ ముందు మేకపోతును నిలబెట్టి.. దాని తలను ఒక్కవేటుతో తెగనరికారు. ఆరక్తంతో కటౌట్ కు రక్తాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.